దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. ఈ సారి శీతాకాలంలో చలికి ఢిల్లీ ప్రజలతోపాటు అన్నదాతల ఉద్యమానికి రాజకీయ నాయకులు కూడా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ రంగంలో కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాలు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయడకుండా గత 20 రోజులుగా ఢిల్లీ సహరిద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమం ఆపేది లేదని భీష్మించుకూర్చున్నారు. […]
రైతుల ఆందోళన.. ఢిల్లీని దాటి దేశానికి, అక్కడ్నుంచి ఇప్పుడు విదేశాలకు కూడా చేరింది. గత ఆరేళ్ళ కాలంలో నరేంద్ర మోడీ చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న రీతిలో పాలన సాగిపోయింది. ఇందులో నోట్ల రద్దూ ఉంది.. బ్యాంకుల మూతలు ఉన్నాయి.. బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల సంక్షోభం.. అక్రమార్కులు దేశాన్ని విడిచిపెట్టి పోవడమూ ఉంది.. కోవిడ్ పేరుజెప్పి కోట్లాది మంది నడుచుకుంటూ బయలుదేరి అందులో కొందరు ప్రాణాలు కోల్పోవడమూ ఉంది. అయితే ఇవేవీ ఆ ఆరేళ్ళకాలంలో బహిరంగంగా […]
వ్యవసాయం రంగంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపుమేరకు జరిగిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతులకు మద్ధతుగా దేశం మొత్తం ఏకమైంది. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు బంద్కు సంపూర్ణ మద్ధతును ప్రకటించాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బంద్ చేసేందుకు రైతులు పిలుపునివ్వగా.. అంతకు మించిన స్పందన ప్రజల నుంచి వచ్చింది. ఉదయం […]
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆరంభించిన పోరాటం దేశాన్ని కుదిపేస్తోంది. కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం అవ్వడంలో రాజకీయ పార్టీలు కీలకపాత్ర పోషించాయి. ఎన్డీయేతర పార్టీలన్నీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ప్రత్యక్షంగా భారత్ బంద్ లో పాల్గొంటున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం భారత్ బంద్ కు మద్దతు ప్రకటించింది. రాష్ట్ర […]
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న భారీ నిరసనకు మద్ధతుగా నేడు జరుగుతోన్న భారత్ బంద్ ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా కొనసాగుతోంది. భారత్ బంద్కు రైతులు ఇచ్చిన పిలుపునకు స్పందించిన అన్ని పక్షాలు మద్ధతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతులకు మద్ధతుగా నిలిచింది. బంద్కు సంపూర్ణంగా సహకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు […]
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం రాజకీయంగానూ ఉంటుందనే చర్చ మొదలయ్యింది. పార్లమెంట్ లో ఈ చట్టాల ఆమోదానికి ప్రభుత్వానికి అండగా నిలిచిన వివిధ పక్షాలు కూడా ఈసారి బంద్ లో పాల్గొనడం దానికి సంకేతంగా చెప్పవచ్చు. రైతుల సంక్షేమం కోసమని ప్రభుత్వం చెబుతున్న మాటలను దాదాపుగా ఎవరూ అంగీకరిస్తున్న దాఖలాలే లేవు. సోషల్ మీడియాలో తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ సెక్షన్లు స్పందిస్తున్నాయి. అంతేగాకుండగా గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని రీతిలో […]