బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్‌కుమార్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపడతారని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ స్పష్టం చేయగా.. ఆ బాధ్యలు ఎప్పుడు చేపట్టేది ఈ రోజు నితీష్ నిర్ణయించారు. నితీష్ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల ఎమ్మెల్యేతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన నితీష్‌కుమార్.. ఆ తర్వాత రాజ్‌భవన్ వెళ్లారు. […]
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఎన్డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరి పోరు సాగగా.. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ ఎన్డీఏ లీడింగ్‌లోకి వెళుతోంది. 243 సీట్లు గాను పూర్తి స్థాయిలో కౌటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఎన్డీఏ కూటమి 122 సీట్లలో, మహాకూటమి 108 సీట్లలో అధిక్యంలో ఉన్నాయి. ఎల్జేపీ ఏడు, ఇతర పార్టీలు, స్వతంత్రులు మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. మూడు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ […]
ఈ నెల 7వ తేదీన బిహార్ మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం కూడా ముగిసింది. పదునైన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష కూటములు ప్రచార పర్వాన్ని రక్తి కట్టించాయి. మాటల యుద్ధంతో రణరంగాన్ని తలపించాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అధికార పక్షం చెప్పే మాటలకు ప్రతిపక్షం, ప్రతిపక్షం చెప్పే మాటలకు అధికార పక్షం కౌంటర్ ఇస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతుంటాయి. కానీ బిహార్ ఎన్నికలలో ఓ […]
బిహార్ ఎన్నికల్లో నడుస్తోన్న పొత్తు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమి, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా పోటీ చేస్తుండగా ఎల్ జె పి.. జేడీయూతో విభేధించి ఒంటరిగా పోటీలో నిలిచింది. మూడు దశల్లో జరగాల్సిన బిహార్ ఎన్నికల్లో తొలి దశ పూర్తయింది. ప్రస్తుతం రెండో దశ పోలింగ్ ప్రచారం సాగుతోంది. ఆయ పార్టీల రాజకీయ నాయకుల విమర్శలు, ప్రకటనలతో బిహార్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఎల్ జె పి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ […]
అదేంటి.. నితీష్‌పై మోదీ ఆరోపణలు చేయడం ఏంటి..? బిహార్ ఎన్నికల్లో బీజేపీ – జేడీయూ కలిసే పోటీ చేస్తున్నాయి కదా..! తొలి విడత పోలింగ్ తర్వాత ఏమైనా విడిపోయాయా..!! అసలేం జరిగింది..!! ఇలాంటి ప్రశ్నలతో ఆశ్చర్యపోతున్నారా..? కాస్త రిలాక్స్ అవ్వండి.. అసలు విషయం ఏంటంటే.. రెండో విడత సమరానికి బిహార్ రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. శనివారం ప్రచార కార్యక్రమంలో భాగంగా […]
బిహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన కోవిడ్‌కు ఉచిత టీకా హామీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాజకీయ పార్టీలు ఇలా హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తెలిపింది. సంక్షేమంలో భాగంగా ఇలాంటి హామీ ఇవ్వడం సరైనదేనని స్పష్టం చేసింది. బిహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా బిహారీలకు ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తామని పేర్కొంది. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే […]
బీహార్ రాజకీయాలలో బిజేపీ,ఆర్జేడీ,జేడీయూ పార్టీలదే ప్రధాన పాత్ర.వీటిలో ఏ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన రాజ్యాధికారం దక్కుతుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి..కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మిత్రుల కలిసి బరిలోకి దిగిన జేడీయూ,బీజేపీ శత్రువుల వలె పరోక్షంగా కత్తులు దూసుకుంటున్నాయి. ప్రస్తుతం బీహార్ ఎన్నికలలో ప్రధానంగా పోటీ రెండు కూటముల మధ్య కేంద్రీకృతమై ఉంది. వీటిలో మొదటిది తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ఒకటి కాగా,నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే రెండవది. 2015 ఎన్నికలలో […]
అమెరికా అయినా ఇండియా అయిన రాజకీయం ఒక్కటే, ఓట్ల కోసం రాజకీయ నేతల హామీలు కూడా ఒకే మాదిరిగా ఉంటాయని స్పష్టమవుతోంది. హామీలు ఇవ్వడంలో విశ్వసనీయత, వాటి అమలు సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా.. అప్పటికప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తోంది. అమెరికా ఎన్నికలు అయినా.. మన దేశంలో జరిగే రాష్ట్ర ఎన్నికలైనా నేతల పంథా మాత్రం ఒకేలా సాగుతోంది. ప్రస్తుతం భారత్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలోనూ అధ్యక్ష […]
ఎవరెన్ని కబుర్లుచెప్పినా ఎన్నికలు, ఓటర్లు, అధికారం చుట్టూనే రాజకీయ పార్టీలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనే భేదభావమేమీ లేదన్నది బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీతో తేలిపోయింది. అప్రతిహతమైన మెజార్టీని ఇచ్చిన దేశ ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు రేకెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా బీజేపీ బీహార్ మేనిఫెస్టో […]
నమ్మకమైన కొందరిని మినహాయిస్తే రాజకీయ నాయకులమీద పేలినన్ని జోకులు ఇంకెవరిమీద పడి ఉండవేమో. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింతగా పెరిగిపోయింది. నాయకుల వ్యవహారశైలి కూడా ప్రజలకు అవకాశం ఇచ్చే విధంగానే ఉంటుంది. దీంతో నాయకుల వ్యవహారశైలి, ప్రజల విమర్శలు జోరుగానే పోటీపడుతుంటాయి. ప్రజల అసహనాన్ని జోకుల రూపంలో చూపిస్తుండొచ్చన్న అంచనాలు కూడా పరిశీలకుల నుంచి విన్పిస్తుంటాయి. పూర్తిస్తాయి రుణమాఫీ అంటే నమ్మి ఓట్లు వేసి ఆ తరువాత బ్యాంకులకు వడ్డీలకు వడ్డీలు కట్టి, కట్టకపోతే తిరిగి […]