ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను సీఎం వైఎస్ జగన్ కోరారు. కొద్దిసేటి క్రితం సీఎం జగన్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. గవర్నర్‌తో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమైన సీఎం జగన్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు గురించి వివరించారు. పరిపాలనా సంస్కరణలో భాగంగా కొత్త […]
ఏప్రిల్ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభంకానుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ శాసన సభలో వెల్లడించారు. జిల్లాల విభజన, పాలన ప్రారంభించేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నా.. కేంద్రం ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు.. అంటూ ప్రతిపక్ష టీడీపీ, అనుకూల మీడియా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ తన ప్రసంగంలో కొత్త జిల్లాల్లో పాలన గురించి క్లారిటీ ఇచ్చారు. దీంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. […]
పాలన, అధికారం వికేంద్రీకరణ వల్ల ప్రజలకు సులభంగా, సరళంగా పాలన ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో స్థానిక పాలన విషయంలోనూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరపాలక సంస్థకు ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, మునిసిపాలిటీ కు ఇద్దరు వైస్ చైర్మన్ లు నియమించే కీలకమైన నిర్ణయానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో స్థానిక పాలనలో కీలక అడుగు పడినట్లయింది. నిజంగా […]
పెరుగుట విరుగుట కొరకే అనే మాట బహుశా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లాంటి వారి వ్యవహారశైలి వల్లే ఉద్భవించి ఉంటుంది. విచ్చలవిడిగా ప్రవర్తించే వారిని ఉద్దేశించి ఈ మాట అంటుంటారు. పరిధి దాటి వ్యవహరించిన వారు కింద పడక తప్పదు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. తనకు అధికారం ఉందా..? లేదా..? అనే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వివాదాస్పద వ్యవహార శైలి పతాక స్థాయికి చేరుకుంది. నిన్నటి వరకు ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని, విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు మరో అడుగు ముందుకు వేశారు. తనపై విమర్శలు చేస్తున్నారంటూ.. ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తప్పించాలని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు లేఖ రాశారు. మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స […]
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు నిలిపివేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో బేటీ కావడం ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో స్పష్టమవుతోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజనల్ బెంచ్‌లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సవాల్ […]
గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్‌కు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత వారిద్దరు 40 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దేవాలయాలపై దాడులు, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌తో […]
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌తో భేటీ కాబోతున్నారు. ఐదు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్.. ఐదున్నర గంటలకు గవర్నర్‌తో సమావేశం కాబోతున్నారు. అర గంటలపాటు గవర్నర్‌తో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. భేటీ ఖరారైన విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు జరగడం, అనంతరం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌తో […]
ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పంచాయితీ కొనసాగుతోంది. కరోనా వైరస్ పేరు చెప్పి మార్చిలో వాయిదా వేసిన ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరికి వారు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా […]
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేంద్రంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొద్దిసేపటి క్రితం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై కొడాలి నాని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. తనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణపై తాను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే.. […]