ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా కోవిడ్ ఇంకా అదుపులోకి రావడం లేదు. ముమ్మరమైన వైద్య సేవలు, ముందు జాగ్రత్త చర్యల కారణంగా పాజిటివ్ కేసుల వృద్ధి ఆగినా.. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రతి రోజు 20వేల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల బ్లాక్ ఫంగస్ బెంగ కూడా పెరుగుతోంది. వీటి బారిన పడుతున్న వేలమంది ప్రజల్లో సామాన్యులు అధికంగా ఉంటున్నారు. […]
ప్రభుత్వాలు ఏదైనా కొత్త పథకం ప్రవేశపెట్టినా, విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓట్ల కోసమేనన్నది నిన్నమొన్నటి వరకు కనిపించిన పరిస్థితి. ఓటు హక్కు ఉన్న వయోజనులకు సంబంధించి మాత్రమే ఆయా ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర భారతదేశంలో ఉంది. ఈ చరిత్రను తిరగరాసేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజల మౌలిక అవసరాలు తీర్చేలా సీఎం వైఎస్ జగన్ పథకాలు, విధానపరమైన నిర్ణయాలు […]
అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్దకు చేరింది. అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం సుప్రిం కోర్టు క్లారిటీ ఇవ్వబోతోంది. అమరావతి భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు […]
చిన్న, పెద్ద.. పని ఏదైనా సరే బాలారిష్టాలు సర్వసాధారణం. లోటుపాట్లు సవరించుకున్న తర్వాత ఆ పని సజావుగా సాగిపోతుంది. ఆయా అడ్డంకులు, లోపాలను ఎప్పటికి పరిష్కారం అవుతాయనేది ఆయా పనులు చేసే వారి చొరవను బట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ అమలు చేస్తున రేషన్ డోర్ డెలివరీ విధానం కూడా ప్రస్తుతం బాలారిష్టాలు దశలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.50 కోట్ల మంది రేషన్కార్డుదారులకు 9,260 వాహనాల ద్వారా ఇంటి వద్దనే రేషన్, ఇతర […]
భూమి లేదా ఇంటి స్థలం కొనుగోలు అమ్మకాలు ఇప్పటివరకు జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే లావాదేవీలు సాగేవి. రాతలు-కోతలు అక్కడే ఉండేవి. దీనికి ప్రత్యేకమైన శాఖ, అధికారులు అంటూ పెద్ద తతంగం ఉంది. అయితే ప్రజల వద్దకే పాలన ద్వారా అవినీతి రహితంగా ముందుకు తాగాలన్న దృఢసంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం లో నే రిజిస్ట్రేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దశల వారీ అయితే బెటర్ రిజిస్ట్రేషన్లలో […]
నవ్విన నాపచేనే పండుతుంది అంటారు. అది అక్షర సత్యమని బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు విషయంలో మరోమారు రుజువైంది. వివిధ కులాల ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వైసీపీ సర్కార్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో బీసీ కార్పొరేషన్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు బీసీలలోని 139 ఉపకులాల వారికి సరైన ప్రాతినిధ్యం దక్కేలా, ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా 56 కార్పొరేషన్ల జగన్ సర్కార్ గత ఏడాది నవంబర్లో ఏర్పాటు చేసింది. వాటికి పాలక మండళ్లను నియమించింది. […]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఓ నూతన సంక్షేమ పథకానికి పచ్చజెండా ఊపింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచకపోయినా.. ప్రజల ఆకాంక్షల మేరకు వైసీపీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొస్తోంది. ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) నేస్తం పేరుతో అమలు చేయబోయో ఈ పథకం ద్వారా అగ్రవర్ణ పేదలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కాపుల్లోని 45–60 ఏళ్ల మహిళలకు అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం పథకాల మాదిరిగా.. అగ్రవర్ణ పేదల్లోని అదే […]
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణకు ముహూర్తం సమీపిస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంలో కీలక నిర్ణయాలుంటాయనే ప్రచారం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో అమరావతికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే దిశలో సాగుతోంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఏంచేయాలనే దానిపై చర్చ మొదలయ్యింది సీఎస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపింది. ప్రతిపాదనలు […]
సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలతో పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డుదారులు.. తమ ఇంటి వదనే చౌకదుకాణాల సరుకులు అందుకోబోతున్నారు. ఈ మేరకు రేషన్ సరుకులు సరఫరా చేసే వాహనాలను సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన ప్రారంభించబోతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో […]
రాష్టంలో గత కొద్దీ కాలంగా గుడుల మీద వరుస దాడులు,రాజకీయ ఆరోపణలు తెలిసినవే. ఈ దాడులను నిలువరించటానికి ఇప్పటికే అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వారి పట్ల కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. విగ్రహ ధ్వంసం ఘటనలపై లోతుగా దర్యాప్తు చేసి ఎవరు చేస్తున్నారో బయటపెట్టాలని ఆదేశించారు. వాటి వెనుక ఎవరున్నా లెక్క చేయొద్దని, ఎవరినీ వదిలిపెట్టొద్దని స్పష్టం […]