iDreamPost
android-app
ios-app

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు షురూ! కీలక అడుగు జగన్ ప్రభుత్వం సిద్ధం!!

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు షురూ! కీలక అడుగు జగన్ ప్రభుత్వం సిద్ధం!!

భూమి లేదా ఇంటి స్థలం కొనుగోలు అమ్మకాలు ఇప్పటివరకు జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే లావాదేవీలు సాగేవి. రాతలు-కోతలు అక్కడే ఉండేవి. దీనికి ప్రత్యేకమైన శాఖ, అధికారులు అంటూ పెద్ద తతంగం ఉంది. అయితే ప్రజల వద్దకే పాలన ద్వారా అవినీతి రహితంగా ముందుకు తాగాలన్న దృఢసంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం లో నే రిజిస్ట్రేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

దశల వారీ అయితే బెటర్

రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఒకేసారి ప్రారంభించాలా లేక దశలవారీగా ప్రారంభించాలా అన్నదానిమీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. దశలవారీగా ప్రారంభిస్తేనే ఏవైనా లోపాలు ఎదురైతే సవరించు కుంటూ పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ మొదలు పెట్టాలా లేక ప్రత్యేక మండలాలను ప్రాంతాలవారీగా గుర్తించి పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు అన్నదానిమీద తీవ్ర కసరత్తు జరుగుతోంది.

800 కోట్లు అవసరం!

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మాదిరి పూర్తిస్థాయి సేవలు గ్రామ సచివాలయాలు లో అందుబాటులోకి రావాలంటే దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి 800 కోట్ల అవుతుందని అధికారులు అంచనా. భూముల క్రయ విక్రయాలు, స్థలాల రిజిస్ట్రేషన్ లు ఇతర సేవలకు కనీసం నలుగురు సిబ్బంది అవసరం అవుతారని, డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు, ఈసీ, మ్యూటేషన్, గుంపుల విక్రయం, వివాహ రిజిస్ట్రేషన్ లు, సర్టిఫైడ్ కాపీ ల జారీ వంటి సేవలు ప్రస్తుతం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలన్నీ కనుక సచివాలయాల్లో తీసుకురావాలంటే దానికి తగిన కార్యాలయం, ఫర్నిచర్, అంతర్జాలం, సిబ్బంది, శిక్షణ, ఇతర సౌకర్యాలూ అవసరం కాబట్టి భారీగా నిధులు అవసరం అవుతాయి.

ఎక్కడ ఎక్కువగా?

గడిచిన దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగాయి అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల గ్రామాల్లో ఏడాది మొత్తం మీద పదుల సంఖ్యలోనే రిజిస్ట్రేషన్లు జరిగినట్లు లెక్కలు తీశారు. నగరాలు పట్టణాలలో వాటి సమీప గ్రామాల్లోనే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సుమారు 100 గ్రామాలు ఉంటే 70 గ్రామాల్లో కేవలం పదుల సంఖ్యలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో గ్రామ సచివాలయాల్లో ఎక్కడెక్కడ రిజిస్టర్ కార్యాలయాలు ప్రత్యేకంగా పెడితే బాగుంటుంది అన్నది నిర్వహించబోతున్నారు.

గెజిటెడ్ హోదా సమస్య

గత ఏడాది డిసెంబర్లో కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడు సచివాలయంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి దీని మీద ప్రచారం చేయకపోవడంతో ఒకే ఒక్క రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా రిజిస్ట్రేషన్లు చేయాలంటే ప్రత్యేకమైన ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. సబ్ రిజిస్టార్ లో అందరూ గెజిటెడ్ హోదాలో ఉన్నారు. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శులకు ఆ హోదా లేదు. గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు గెజిటెడ్ హోదాలో ఉన్న వారితో సమాన వేతనాలు అందుతున్నాయి. ఎప్పటినుంచో తమకు జెట్ హోదా కల్పించాలని కోరుతున్నారు. అయితే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుత హోదాలోనే కొనసాగిస్తూ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత వీరి గెజిటెడ్ హోదా మీద తగిన నిర్ణయం తీసుకోవాలనేది ప్లాన్. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద క్రయవిక్రయాలు కోసం నానా యాతనా పడిన ప్రజలకు మరింత సులువుగా ఈ సేవలు అందించేందుకు ఇవి దోహదపడతాయి.