Idream media
Idream media
దేవుళ్లను, ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం ప్రతిపక్షాలకు అలవాటైతే.. రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే రాజకీయాలు అన్నట్లుగా ఏపీ సీఎం జగన్ పంథాగా కనిపిస్తోంది. తన, పర బేధం చూడకుండా అన్నింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ హుందాగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనే కాదు… కుల, మతపరమైన కార్యక్రమాల నిర్వహణలోనూ రాష్ట్ర పెద్దగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న ఆధ్యాత్మిక ఆందోళనలు తెలిసిందే. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారు. దేవుడిని కూడా రాజకీయాలలోకి లాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా దేవాలయాలలో పలు దుర్ఘటనలు జరిగాయి. నాటి ప్రభుత్వమే అభివృద్ధి పేరిట కొన్ని ఆలయాలను కూల్చేసింది కూడా. కానీ నాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎప్పుడూ దేవాలయాలను రాజకీయం చేయలేదు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అయిన జగన్ ఇప్పుడు కూడా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో కూల్చిన దేవాలయాల పునః నిర్మాణానికి పూనుకుంటున్నారు. అందుకే జగన్ పనితీరును ప్రజలంతా హర్షిస్తున్నారని .. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు ఏదో ఒక ఆరోపణ చేస్తుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఆలయాల నిర్మాణానికి నేడు శ్రీకారం…
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రేపు ఉదయం 11:01 నిమిషాలకు ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడలోని రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణానికి రూ.70 లక్షలు వెచ్చించారు. అలాగే సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణానికి ♦️రూ.9.5 లక్షలు, దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయానికి రూ.31.5 లక్షలు, రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం, బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.8 లక్షలు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి రూ.20 లక్షలు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయకు రూ.10 లక్షలు, పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వీరబాబు ఆలయం పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు, కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల ఆలయాన్ని రూ.20 లక్షలతో పునః నిర్మించనున్నారు. దీంతో పాటు విజయవాడ దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు భారీగా నిధులు వెచ్చించారు. కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు చేపట్టనున్నారు. రూ.23.6 కోట్ల వ్యయంతో కేశఖండనశాల భవనాన్ని నిర్మించనున్నారు. రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణంతో పాటు రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనులు చేపట్టనున్నారు. దీంతో పాటు మరిన్ని పనులకు సీఎం జగన్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల నిర్మాణానికి కూడా జగన్ నిధులు వెచ్చించి ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతుల మన్ననలు పొందుతున్నారు.