లాక్ డౌన్ వేళ సెలెబ్రెటీస్ సోషల్ మీడియా కేంద్రంగా గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు. కీలక సంఘటనల వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సాధించిన చారిత్రక విజయం గురించి మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో గుర్తు చేసుకున్నారు. కైఫ్ మాట్లాడుతూ “నాటి ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు ఔటవ్వగానే భారత్ ఓడిపోతుందని భావించా. అప్పటికే నేను నిలదొక్కుకున్నాను. నువ్వు క్రీజులో […]