ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు రేపు గురువారం ఉదయం ఆరు గంటల నుంచి పరుగులు పెట్టనున్నాయి. లాక్డౌన్ నాలుగో విడతలో ఆర్టీసీ బస్సులు తిప్పుకునే వెలుసుబాటు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో 50 శాతం సామర్థ్యంతోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనున్నాయి. కరోనా నేపథ్యంలో […]
కార్యనిర్వాహక విభాగాలను విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల లోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు పది రోజులకు వాయిదా వేసింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి […]
ఆంధ్రప్రదేశ్ లో రైతులు పంట వేయడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రైతుకు 13500 రూపాయల వరకు పెట్టుబడి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. పంట కూడా బాగుంది. ఇంటికి చేరితే చాలా వరకు ఇబ్బందులు నుంచి గట్టెక్కొచ్చు. లాక్ డౌన్ కు ముందు సగటు రైతు భావన ఇది. కానీ లాక్ డౌన్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం కరోనా పాలైంది. చేతికొచ్చిన పంట సిద్ధంగా ఉన్నా..మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి […]
కరోనా ముప్పు పొంచి ఉన్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర వ్యూహంతో సాగుతోంది. ప్రచారం కన్నా పనితీరుతో ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఉన్న వనరులను జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటున్నట్టు ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా వాలంటీర్లు, వార్డు లేదా గ్రామ సచివాలయ సిబ్బంది చొరవ ఉపయోగపడుతున్నట్టు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో ఏ రాష్ట్రంలోనూ లేని యంత్రాంగం ఏపీ ప్రభుత్వం వద్ద ఉండడంతో సమాచార సేకరణ, దాని ఆధారంగా విశ్లేషణ, తగిన చర్యల […]
కరోనా నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దీన్ని ఎలా అరికట్టాలనే దానిపై ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో పూర్థిస్థాయిలో చర్చ జరిగింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్య మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ భేటీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ: ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కార్ కమిటీ వేసింది. ఈ కమిటీలో […]
రాష్ట్రంలో కరోన వ్యాది విజ్రంభిస్తున్న నేపద్యంలో దాని నివారణకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమాహాళ్ళు , మాల్స్, పార్క్ లు , స్విమ్మింగ్ పూల్స్ మూసివేయలని ఆర్డర్ పాస్ చేసింది, అలాగే చిన్న ఆలయాలు, మసీదులు, చర్చులకు వెళ్ళకపోతే మంచిదని, పెళ్ళిల్లు శుభకార్యాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించింది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోన వ్యాది కట్టడికి 480 కోట్ల రూపాయలు విడుదల చెసింది అలాగే బస్తీల్లో ఎవరైనా కుటుంబంలో […]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ , రిటైర్డ్ … ఈ వారం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిన పేరు . స్థానిక ఎన్నికల వేడితో హీటెక్కిన ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఆరు వారాలు స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసి హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి . అంతే కాకుండా వాయిదా కాలంలోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందంటూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి సంచలనానికి […]
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రతిరోజూ కరోనా వైరస్ కట్టడికి సమీక్ష నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖా మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిపై అపోహలను కలిగించి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేసారు. వైరస్ కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని అందులో భాగంగా విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకూ సెలవులను ప్రకటించామని వైద్యశాఖా మంత్రి ఆళ్ళ నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ […]
గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉంది టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడి వ్యవహారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేరుతో హల్చల్ చేసిన లేఖ నిన్న, ఈ రోజు మీడియాలో సృష్టించిన రాజకీయ దుమారం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ లేఖ తాను రాయలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు జాతీయ వార్త ఛానెల్ ఏఎన్ఐకి చెప్పారు. మరో వైపు ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి […]
ఎన్నికల మెనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానమని చెప్పిన సీఎం జగన్ అందులో పెట్టిన ప్రతి అంశం అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్కొక్కటిగా మెనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తున్నారు. తొలి హామీ ఫించన్ పెంపు నుంచి అమ్మ ఒడి వరకూ అనేక హామీలకు కార్యరూపం ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు రాష్ట్రంలో 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు […]