Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు రేపు గురువారం ఉదయం ఆరు గంటల నుంచి పరుగులు పెట్టనున్నాయి. లాక్‌డౌన్ నాలుగో విడతలో ఆర్టీసీ బస్సులు తిప్పుకునే వెలుసుబాటు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో 50 శాతం సామర్థ్యంతోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయనున్నాయి.
కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
– జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే సర్వీసులు నడుస్తాయి.
– మార్గమధ్యలో ఎక్కడా ఆగి ప్రయాణికులను ఎక్కించుకోరు.
– ప్రతి ప్రయాణికుడికి మాస్క్ తప్పనిసరి
– టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి.
– టిక్కెట్ చూపించడం, మోబైల్ మెస్సెజ్ చూపించాల్సిన అవసరం ఉండదు.
– 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు అనారోగ్య, అత్యవసర కారణాలు ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు.