ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో దీన్ని కొనసాగించాలా..? వద్దా..? అనేదానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు కాల్ చేసి రాష్ట్రాల్లో పరిస్థితులు, కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వైద్యంపై పూర్తి భరోసా ఇస్తూ కీలక ప్రకటన చేశారు. మెనిఫెస్టో పెట్టిన విధంగా వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామన్న మేరకు ఇప్పటికే పశ్చిమ గోదావరిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. దాని పరిధిని మరికొన్ని జిల్లాలకు పెంచడంపై సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ మేరకు ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో […]
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారంలో బాధితులకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైజాగ్ గ్యాస్ లీక్ సంఘటనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం సోమవారం నాటికి చెల్లించాలని, ఆదివారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ లీక్ వల్ల హాస్పిటల్లో చికిత్స […]
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సర్పంచ్ లతో మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచ్ లతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ప్రధాని మోదీతో సర్పంచులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకొనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీలకు ప్రధాని నరేంద్ర మోడీ అవార్డులు, ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే దేశంలో స్థానిక సంస్థల వ్యవస్థ […]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన వాలంటర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నదో దేశమంతా చూస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సరికొత్తగా వాలంటరీ వ్యవస్థ విధానాన్ని ఏపీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం సర్వేలు, ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించడంలో వాలంటీర్లు ఎనలేని సేవలు చేస్తున్నారు. వాలంటీర్ల సేవలను జాతీయ మీడియా కూడా కొనియాడింది. ఈ వ్యవస్థను పలు […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 618 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 31 మందికి వైరస్ సోకింది.దీనితో ఈ సంఖ్య 600 దాటింది. కృష్ణా జిల్లాలో ఈ ఒక్కరోజే 18 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారి నుంచి 57 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 546 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. ఆ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. రాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారా జగన్ కు ఈ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. 10 నిమిషాల్లోనే ఫలితాలు ఇవ్వడం ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ప్రత్యేకత. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వైరాలజీ ల్యాబుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు గరిష్టంగా నిర్ధారణ పరీక్షలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దక్షిణకొరియా నుంచి ర్యాపిడ్ […]