‘ఆంధ్రా బ్యాంక్’ తెలుగు వారి జీవితాలతో పెనవేసుకు పోయిన పేరు. కోట్లాది మందికి జీవనోపాధి కల్పించిన సంస్థ …. వేలాది మంది ఉద్యోగులకు జీవితం ప్రసాదించిన సంస్థ …. 1923 నవంబరు 28 న మచిలీపట్నంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో గాంధీ మహాత్ముని ప్రియ శిష్యుడైన డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిచే మచిలీపట్నం కేంద్రంగా ప్రారంభమయింది. అనతి కాలంలోనే శాఖోపశాఖలుగా విస్తరించి తెలుగు నేలపై ఎవరూ పోటీకి రాలేనంతగా ఎదిగింది.1963 లో కేంద్ర కార్యాలయం […]