iDreamPost

చిక్కుల్లోకి చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో కదలికలు!

చిక్కుల్లోకి చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో కదలికలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు చుట్టూ వివిధ కేసులు వరుసలో ఉన్నాయి. ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూముల కుంభకోణం వంటి కేసులు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఇలా ఏపీలోని కేసులతోనే చంద్రబాబు ఇబ్బందులు పడుతుంటే..తాజాగా ఓ పాత కేసు మరోసారి బయటకు వచ్చింది. దీంతో చంద్రబాబు మరింత చిక్కుల్లోకి వెళ్లబోతున్నారంటూ పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

“ఓటుకు నోటు”.. ఈ పదం కొన్నేళ్ల  క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురి చేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ కోసం డబ్బులు ఆఫర్  చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చుట్టు ఓటుకు నోటు వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఇందులో రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు రేవంత్ రెడ్డి చిక్కారు. ఇదే కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైల్లో కూడా  ఉన్నారు.  తాజాగా ఈ ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 2017లో ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పిటిషన్లు వేశారు. అందులో ఒకటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు. ఓటుకు నోటు కేసును సంజయ్ కుమార్, జస్టిస్సుందరేష్ ధర్మాసనం విచారించనుంది. దీంతో ఈ కేసు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ఓటుకు నోటుకు కేసును తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేయడం లేదని, పూర్తి ఛార్జిషీటు వేయలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన మరో పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ రెండు పిటిషన్ల సుప్రీకోర్టులో విచారణతో చంద్రబాబు మరింత చిక్కుల్లోకి వెళ్తాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి