iDreamPost
android-app
ios-app

లంచాలు తినేసి.. కంచాలు మోగిస్తున్నారు: మాజీ మంత్రి పేర్ని నాని

లంచాలు తినేసి.. కంచాలు మోగిస్తున్నారు: మాజీ మంత్రి పేర్ని నాని

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీ రాజకీయాలపై ఆసక్తిని పెంచింది. అంతేకాక రాష్ట్రంలో పొలిటికల్ వార్.. సమ్మర్ హీట్ ను తలపిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్యలో కత్తులు లేని మాటల యుద్ధం సాగుతోంది. నిన్న టీడీపీ తలపెట్టిన “మోత మోగిద్దాం” కార్యక్రమానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ వారిపై తీవ్ర స్థాయిలో విరుచక పడుతున్నారు. చేసిన పాపాలకు చంద్రబాబుకు శిక్ష తప్పదంటూ తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. లంచాలు తినేసి.. కంచాలు మోగిస్తున్నారంటూ టీడీపీ తలపెట్టిన ప్రోగ్రామ్ పై సెటైర్లు వేశారు.

ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ  ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేశ్ లపై మాజీ మంత్రి పేర్ని నాని ఓ రేంజ్ లో విరుచకపడ్డారు. తనదైన శైలిలో టీడీపీపై సెటైర్లు వేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని, ముద్రగడ్డ పద్మనాభం నిరసనకు దిగితే ఆయన్ను వేధించారని దుయ్యాబట్టారు. చేసిన పాపాలకు, ఘోరాలకు, దోపిడీలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని ఆయన అన్నారు.

“నిన్న టీడీపీ వాళ్ల చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమం అంతా  నవ్వులాటకా కనిపించింది. నిన్న అంతా నవ్వుకుంటూ విజిల్స్, మోత మోగించారు. చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళ్లడంపై టీడీపీ శ్రేణులకు ఆవేదన  ఉన్నట్లు కనిపించలేదు. అందుకే నవ్వుతూ విజిల్స్ వేశారు. లంచాలు తినేసి కంచాలు మోగిస్తున్నారు. బాబుపై ఉన్నవి అక్రమ కేసులు అయితే కోర్టుల్లో ఎందుకు ఆయనకు అనుకూలంగా తీర్పులు రావటం లేదు. కోటి మంది సభ్యులు ఉన్నారని చెప్పే టీడీపీ కేడర్ ఎక్కడికిపోయింది. చంద్రబాబు ప్రజల సొమ్ము నొక్కేశారని అంతా భావిస్తున్నారు. అలానే జగన్ పై పెట్టిన కేసులు అక్రమం అని ప్రజలు నమ్మారు కాబట్టే.. ఆయనను బంపర్ మెజార్టీతో గెలిపించారు” అని పేర్ని నాని పేర్కొన్నారు.

లోకేశ్ కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తులపై మీద విచారణకు సిద్దమవ్వాలని, చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి విచారణ చేద్దామని, దానికి సిద్ధమా? అంటూ పేర్ని నాని సవాల్ విసిరారు. బాబు ఇంతకాలం స్టేలు తెచ్చుకుని బతికాడని, యావజ్జీవ ఖైదు తప్పదనే స్టేల కోసం ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు. కోర్టులో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలని పేర్ని నాని హితవు పలికారు. మరి.. పేర్ని నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişCasibomCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobet