iDreamPost
android-app
ios-app

మహేశ్ బాబు-సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏంటో మీకు తెలుసా?

  • Author Soma Sekhar Updated - 01:25 PM, Tue - 22 August 23
  • Author Soma Sekhar Updated - 01:25 PM, Tue - 22 August 23
మహేశ్ బాబు-సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏంటో మీకు తెలుసా?

ఇండస్ట్రీలో ఒక్కో కాంబినేషన్ కు ఒక్కో క్రేజ్ ఉంటుంది. ఈ కాంబినేషన్లు ఎక్కువగా.. హీరో-డైరెక్టర్, హీరో-హీరోయిన్ లలో ఉంటాయి. పలానా హీరోత పలానా డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అని తెలియగానే.. ఆ మూవీపై ఎక్కడాలేని బజ్ ఏర్పడుతుంది. ఇక ఇదివరకే సూపర్ హిట్ కాంబో.. మళ్లీ రిపీట్ అయితే ఆ కిక్కే వేరప్ప అంటారు ఫ్యాన్స్. ఇక హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ వెండితెరపై పండితే చాలు.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడం పక్కా. అయితే కొన్ని కాంబినేషన్లు చివరి నిమిషం వరకు వచ్చి ఆగిపోతాయి. ఆ జోడీని వెండితెరపై చూడాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి జోడీ కాంబినేషన్లో మూవీ మిస్ అయ్యింది. అవును మహేశ్ బాబు-సౌందర్య కాంబినేషన్లో ఓ మూవీ మిస్ అయ్యిందని మీలో ఎంతమందికి తెలుసు?

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. టాలీవుడ్ టాప్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మహేశ్ బాబు, దివంగత హీరోయిన్ సౌందర్య కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ సెట్ కాలేదు. మరి ఆ సూపర్ హిట్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెండున్నర దశాబ్దాల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యమలీల’. కమెడియన్ అలీ, ఇంద్రజ జంటగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ముందుగా మహేశ్ బాబు-సౌందర్యను దృష్టిలో పెట్టుకుని రచించారట దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. వీరిద్దరితో యమలీల తీద్దామని ప్లాన్ చేశాడట. కానీ ఆ సమయంలో మహేశ్ బాబు ఏజ్ 19 సంవత్సరాలు కాగా.. సౌందర్య వయసు 22 ఏళ్లు. అదీకాక సూపర్ స్టార్ కృష్ణకు ఈ కథ వినిపించగా.. ఇంత చిన్న ఏజ్ లో మహేశ్ ఇంత పెద్ద కథను హ్యాండిల్ చేయలేకపోవచ్చు.. వేరే హీరోతో తీయమని సలహా ఇచ్చారట సూపర్ స్టార్. దీంతో అలీతో యమలీల తియ్యడం.. అది సూపర్ హిట్ కావడం మనకు తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి కొద్దిగా కన్విన్స్ చేస్తే.. మహేశ్-సౌందర్యల కాంబినేషన్ మనం వెండితెరపై చూసి ఉండేవాళ్లమే. మరి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే.. ఎలా ఉండేదో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నా రూమ్​లో అతడు సీక్రెట్ కెమెరా పెట్టాడు: ‘తీన్​మార్’ హీరోయిన్!

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş