iDreamPost

సుజ‌నా, సీఎం ర‌మేష్ ని దూరం పెట్టారా

సుజ‌నా, సీఎం ర‌మేష్ ని దూరం పెట్టారా

జ‌న‌సేన బీజేపీ బంధం ఖ‌రార‌య్యింది. ప్ర‌స్తుతానికి క‌లిసి కాపురం మొద‌లెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తీరిక చూసిన మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌వుదామ‌నే అంగీకారానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఏపీ బీజేపీ వ్య‌వ‌హారాల్లో కీల‌క‌మైన ఈ ప‌రిణామాల‌కు మాజీ కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రిని ఆపార్టీ దూరం పెట్ట‌డం ఆస‌క్తిగా మారింది. ఆయ‌న‌తో పాటుగా మ‌రో నేత సీఎం ర‌మేష్ ని కూడా క‌నీసం సంప్ర‌దించ‌లేద‌నే ప్ర‌చారం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవ‌ల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీల‌కు మాట మాత్రం కూడా చెప్ప‌క‌పోవ‌డం విశేషంగా ఉంద‌ని బీజేపీ క్యాంపులో చ‌ర్చ సాగుతోంది. బీజేపీకి తానే బాస్ అవుతాన‌ని, ఏపీలో కీల‌క స్థానం అధిరోహిస్తాన‌ని అంద‌రి ద‌గ్గ‌ర చెప్పుకుంటున్న సుజ‌నాకి ఇది షాకిచ్చే అంశ‌మేన‌ని స‌మాచారం.

ఇటీవ‌ల అమ‌రావ‌తి విష‌యంలో సుజ‌నాకి బీజేపీ నుంచి పెద్ద‌గా మ‌ద్ధ‌తు ల‌భించ‌లేదు. పైగా సుజ‌నా కేంద్రానికి చెబుతానంటే, త‌మ‌కు సంబంధం లేద‌ని జీవీఎల్ తేల్చేశారు. ఇలా భిన్న‌మైన ప్ర‌క‌ట‌న‌ల‌తో బీజేపీ నేత‌లే సుజ‌నాకి బ్రేకులు వేస్తున్న తీరుకి కొన‌సాగింపుగానే ఈ ప‌రిణామం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

ఏపీ రాజ‌కీయాల్లో బీజేపీలో కాపుల ప్రాధాన్యం పెరిగేందుకు ప‌వ‌న్ తో పొత్త దోహ‌దం చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్న స‌మ‌యంలో క‌మ్మ స‌మాజిక‌వ‌ర్గానికి చెందిన కీల‌న నేత‌ను విస్మ‌రించ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అదే స‌మ‌యంలో సీఎం ర‌మేష్, టీజీ వెంక‌టేష్ వంటి వారిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం కూడా ఆ న‌లుగురు ఎంపీల‌కు తీవ్ర అసంతృన్తిని క‌లిగిస్తోంద‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి