iDreamPost

మీ ఇంట్లో ఖాళీ స్థలం ఉందా? ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే.. నెలకు 50 వేలు ఆదాయం!

  • Published May 11, 2024 | 6:47 PMUpdated May 11, 2024 | 6:47 PM

చాలామంది ఇంట్లోనే ఏదైనా తయారుచేసి బయట అమ్మాలని అనుకుంటారు. మరి అలాంటి వ్యాపారం చేయాలి అనుకునే వారికి కేవలం ఇంట్లో చిన్న ఖాళీ స్థాలం దానితో పాటు ఈ వస్తువులు ఉంటే చాలు. అద్భుతమైన వ్యాపారంతో పాటు మంచి లాభాలను పొందవచ్చు. ఇంతకి ఆ వ్యాపారం ఏమిటంటే..

చాలామంది ఇంట్లోనే ఏదైనా తయారుచేసి బయట అమ్మాలని అనుకుంటారు. మరి అలాంటి వ్యాపారం చేయాలి అనుకునే వారికి కేవలం ఇంట్లో చిన్న ఖాళీ స్థాలం దానితో పాటు ఈ వస్తువులు ఉంటే చాలు. అద్భుతమైన వ్యాపారంతో పాటు మంచి లాభాలను పొందవచ్చు. ఇంతకి ఆ వ్యాపారం ఏమిటంటే..

  • Published May 11, 2024 | 6:47 PMUpdated May 11, 2024 | 6:47 PM
మీ ఇంట్లో ఖాళీ స్థలం ఉందా? ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే.. నెలకు 50 వేలు ఆదాయం!

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ బయట చిరు తిండ్లకే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అయితే వీరిలో స్కూల్ కు వెళ్లే పెద్దల నుంచి ఆఫీసుకు వెళ్తే ఎంప్లాయిస్ వరకు అందారు ఏదైనా స్నాక్ తినాలంటే ఎక్కువగా బయట దొరికే నాసి రకమైన ఫుడ్ నే తింటుంటారు. ఇక ఆ ఫుడ్ తినడం వలన లేనిపోని ఆనారోగ్య సమస్యలు తలెత్తుంటాయి. అందుకే బయట ఫుడ్ తినేటప్పుడు అక్కడ వారు తయారు చేసే విధానాన్ని, ఫుడ్ క్వాలిటీ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవడం చాలా మంచింది. మరి బయట దొరికే ఫుడ్ విషయంలో అన్ని జాగ్రత్తాలు తీసుకొని తినడం అంటే చాలావరకు సాధ్యం పడదు. అలాని తినకుండా ఉండాలేము.

అలాంటప్పుడు మనం కూడా ఆ స్నాక్స్ ను ఇంట్లో ఎందుకు తయారు చేసుకోకూడాదు. అలాగే వాటిని ఎందుకని బయట అమ్మాకూడదు అనే ఆలోచన మీలో ఎవరికైనా వచ్చిందా.. అయితే ఇప్పుడే రకరకాల స్నాక్స్, చిప్స్ బిజినెస్ ను మీ ఇంట్లోనే ఈ విధంగా స్టార్ట్ చేసేయండి. మరి, ఈ వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే చాలు. ఇంతకీ ఆ బిజినెస్ ను ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడే తెలుసుకోండి. చాలామంది ఇంట్లో రకరకాల స్నాక్స్ తయారీ చేసి బయట అమ్మాలని ప్లాన్ చేస్తుంటారు. కానీ, దీనికి పెట్టుబడి ఎక్కువగా పెట్టాలని భయపడుతుంటారు. అంతేకాకుండా.. దీనికి ఏఏ ప్రొడక్ట్స్ అవసరమవుతాయో కూడా చాలామందికి తెలియదు.

అయితే ఈ బిజినేస్ కు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే దీనికి రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పైగా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. మంచిగా క్లిక్ అయ్యే బిజినెస్ ఇది. అంతేకాకుండా రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంతకి ఈ స్నాక్స్, చిప్స్ బిజినెస్ ను ఎలా స్టార్ట్ చేస్తారంటే.. దీనికి కావాల్సిందల్లా.. మీ ఇంటిలో చిన్న ఖాళీ స్థలం. అందులో ఓ టెంట్ వేసుకుని, చిన్నగా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇక స్థానికంగా మీ వ్యాపారానికి మౌత్ పబ్లిసిటీ వస్తే చాలు.. ఆదాయం కూడా రెట్టింపు చేస్తుంది.

ఇక ఈ చిప్స్ తయారీకి పెద్ద పెద్ద మెషిన్లు అవసరం లేదు. కొన్ని పరికరాలను తీసుకుంటే చాలు. అలాగే కూరగాయలను ముక్కలు కోసేందుకు కట్టర్, ఓ పెద్ద బాండీ, పెద్ద మూకుడు, నూనె, ఉప్పు, మసాలాలు ఉంటే చాలు. వీటితో పాటు చిన్న చిన్న కవర్ ప్యాకెట్లు కూడా అవసరం. కాగా, అవి  చిప్స్ ను పార్శిల్ చేసేందుకు అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే.. మీ ఇంటి దగ్గరున్న హోల్‌సేల్ షాపులతో పాటు.. స్థానికంగా మీరే షాపు కింద పెట్టుకుని వీటిని అమ్మొచ్చు. సుమారు 10 కిలోల చిప్స్ అమ్మితే.. దాదాపుగా రూ. వెయ్యి వరకు మిగులుతుంది. ఇలా చూసుకుంటే.. రోజుకు నాలుగు వేల వరకు సంపాదించవచ్చు. క్వాలిటీ, క్వాంటిటీ మీరు రెండూ మైంటైన్ చేయగలిగితే.. కచ్చితంగా ఈ వ్యాపారంలో అధిక లాభాలను చూడవచ్చు.  మరీ, ఈ స్నాక్స్ బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి