iDreamPost

వీడియో: RRపై ఓటమి.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో దృశ్యాలు చూస్తే కళ్లు చెమర్చుతాయి!

ప్లే ఆఫ్స్  లో ఓడిన తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం చూస్తే ఫ్యాన్స్ కు గుండెలు తరుక్కు పోవడం ఖాయం. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ యాజమాన్యం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్లే ఆఫ్స్  లో ఓడిన తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం చూస్తే ఫ్యాన్స్ కు గుండెలు తరుక్కు పోవడం ఖాయం. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ యాజమాన్యం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వీడియో: RRపై ఓటమి.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో దృశ్యాలు చూస్తే కళ్లు చెమర్చుతాయి!

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ కథ ప్లే ఆఫ్స్ లోనే ముగిసింది. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ఈ సీజన్ లో ఎవ్వరూ ఊహించని విధంగా నాకౌట్స్ లోకి ప్రవేశించింది బెంగళురు టీమ్. కానీ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో ఆర్సీబీ ప్లేయర్ల గుండెలతో పాటుగా ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్ అయ్యాయి. ఇక ప్లే ఆఫ్స్  లో ఓడిన తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం చూస్తే ఫ్యాన్స్ కు గుండెలు తరుక్కు పోవడం ఖాయం. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ యాజమాన్యం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు టీమ్. అయితే ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో దారుణ ప్రదర్శనతో తీవ్ర విమర్శలను మూటగట్టుకోవడంతో పాటుగా టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు వచ్చింది. తొలి 8 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్కవిజయం సాధించింది. అయితే ఆ తర్వాత గొప్పగా పుంజుకున్న ఆర్సీబీ వరుసగా 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. కానీ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి తన కలను సాకారం చేసుకోకుండానే వెనుదిరిగింది.

ఇక రాజస్తాన్ పై ఓటమి తర్వాత రాయల్ ఛాలెంజర్స్ డ్రెస్సింగ్ రూమ్ లో దృశ్యాలను చూస్తూ కళ్లు చెమర్చుతాయి. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో బాధతో ఉన్న సీన్స్ ఫ్యాన్స్ ను గుండెలు పగిలేలా చేస్తున్నాయి. మాక్స్ వెల్ అయితే ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ డోర్ ను గట్టిగా చేయితో కొట్టుతూ తోపలికి వెళ్లాడు. ఇక కెప్టెన్ డుప్లెసిస్ ఈ సీజన్ లో తమ జర్నీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, డీకే కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో గెలిచినప్పుడు ఎలాంటి సంబరాలు చేసుకున్నారో ఈ వీడియోలో చూపించారు. గత 17 ఏళ్లుగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. మరి ఆ వీడియోను మీరూ చూసి.. ఈ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి