iDreamPost

Jr. NTR ఫ్యాన్స్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన నందమూరి హీరో చైతన్య కృష్ణ! డోంట్ కేర్ అంటూ!

  • Published May 23, 2024 | 12:51 PMUpdated May 23, 2024 | 12:51 PM

Nandamuri Chaitanya Krishna: నందమూరి చైతన్య కృష్ణ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ వివరాలు..

Nandamuri Chaitanya Krishna: నందమూరి చైతన్య కృష్ణ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ వివరాలు..

  • Published May 23, 2024 | 12:51 PMUpdated May 23, 2024 | 12:51 PM
Jr. NTR ఫ్యాన్స్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన నందమూరి హీరో చైతన్య కృష్ణ! డోంట్ కేర్ అంటూ!

నిన్నటి నుంచి సోషల్‌ మీడియా, మీడియాలో నందమూరి హీరో చైతన్య కృష్ణ పేరు మార్మొగిపోతుంది. ఓ వైపు ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసినా కూడా.. పోలింగ్‌ నాడు జరిగిన దాడులకు సంబందించి దర్యాప్తు జరుగుతుండగా.. నందమూరి హీరో చైతన్య కృష్ణ .. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులను టార్గెట్‌ చేస్తూ.. వారిని బూతులు తిడుతూ.. ఫేస్‌బుక్‌ వేదికగా పోస్టులు చేయడంతో సోషల్‌ మీడియా వార్‌ రాజుకుంది. ఈ పోస్ట్‌పై జూనియర్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత అని కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ చైతన్య కృష్ణ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా వివాదాన్ని మరి కాస్త పెంచే ప్రయత్నం చేస్తూ.. నేడు అనగా గురువారం నాడు కూడా మరో పోస్ట్‌ చేశాడు. అది వైరల్‌ కావడం.. దానిపై విమర్శలు వస్తున్నాయి.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నా బొచ్చు ​కూడా పీకలేరంటూ.. పోస్ట్‌ చేసిన చైతన్య కృష్ణ నేడు మరో ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్‌ చేశాడు. జూనియర్‌ ఫ్యాన్స్‌కు మరోసారి వార్నింగ్‌ ఇచ్చాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు.. వాట్సాప్‌, ఫేస్‌బుక్కుల్లో కొత్త పేజీలు క్రియేట్‌ చసి మరి నన్ను బూతులు తిట్టారు. అయినా సరే నేను లెక్క చేయను అంటూ.. సదరు పేజీలకు సంబందించిన స్క్రీన్‌ షాట్స్‌ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. దాంతో మరోసారి ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై జూనియర్‌ అభిమానులు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. మా అన్న ఎన్టీఆర్‌ అవతలి వారిని విమర్శించమని ఎప్పుడూ చెప్పడు. నీ అభిమానులే ఇలా మా అన్న పేరు మీద పేజీలు క్రియేట్‌ చేసి కామెంట్స్‌ చేస్తున్నారేమో చూసుకో అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక దీనికి ముందు పోస్ట్‌లో కూడా చైతన్య కృష్ణ జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఫేస్‌బుక్‌ వేదికగా వార్నింగ్‌ ఇచ్చాడు. ‘‘ఎన్టీఆర్‌ అభిమానులందరకి నా వార్నింగ్‌ ఇదే.. వైఎస్సార్‌సీపీ నేతలు కొండాలి నాని, వల్లభనేని వంశీ, మీరు సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి, బొచ్చు కూడా పీకలేరు.. నేను ఉండగా మా మావయ్య చంద్రబాబు నాయుడు, బాబాయ్‌ బాలకృష్ణని ఎవరూ ఏం చేయలేరునాసినిమా రిలీజ్ సమయంలో జూనియర్ ఫ్యాన్స్, వైఎస్సార్ సీపీ వాళ్లు కల్పించుకుని నన్ను బాగా ట్రోల్‌ చేశారు. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి వార్నింగ్‌ ఇచ్చి.. వార్తల్లో నిలిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి