iDreamPost

బిగ్‌ బ్రేకింగ్‌: వడదెబ్బతో పాటు షారుఖ్‌ ఖాన్‌కు హార్ట్‌ స్ట్రోక్‌!

  • Published May 23, 2024 | 1:20 PMUpdated May 23, 2024 | 1:20 PM

Shah Rukh Khan, KKR vs SRH, Ahmedabad, KD Hospital: కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ తర్వాత.. షారుఖ్‌ వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సమాచారం ప్రకారం ఆయన హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు తెలుస్తోంది.. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్‌ హీరో, కేకేఆర్‌ కో-ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌కు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. తొలుత వడదెబ్బతో అస్వస్థతకు గురై.. షారుఖ్‌ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు షారుఖ్‌కు వడదెబ్బతో పాటు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. షారుఖ్‌ వడదెబ్బ, అధిక వేడి కారణంగా కాస్త అస్వస్థతకు గురైనట్లు మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం ఉంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. ఇప్పుడు ఈ హార్ట్‌ స్ట్రోక్‌ విషయం బయటికి రావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.

లీగ్‌ దశలో 9 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరిన కేకేఆర్‌.. క్వాలిఫైయర్‌-1లో అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు షారుఖ్‌ ఖాన్‌ కూడా స్టేడియానికి వచ్చారు. అయితే.. కేకేఆర్‌ మ్యాచ్‌ గెలిచిన తర్వాత.. గ్రౌండ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను కలిసిన షారుఖ్‌ ఖాన్‌.. కేకేఆర్‌ ఆటగాళ్లను ప్రశంసించారు. ఈ మ్యాచ్ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరారు. తొలుత అధిక వేడి, వడ దెబ్బతో ఆస్పత్రి చేరినట్లు తెలిసినా.. దాంతో పాటే మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షారుఖ్‌కు అత్యాధునికి వైద్య సేవలు అందుతున్నాయి. ఆయనకు ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు ప్ర‌స్తుతం షారుఖ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని , అభిమానులు భయపడాల్సిన పనిలేదని వెల్లడించారు. షారుఖ్‌ ఉన్న హాస్పిటల్ చుట్టూ పోలీసులు భారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేశారు. తమన అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ స‌హ య‌జ‌మాని, షారుఖ్‌ స్నేహితురాలు అయిన జూహీ చావ్లా ఆస్పత్రిలో ఉంటూ.. ఆయనకి అందుతున్న వైద్య సేవలను దగ్గరుండి చూసుకుంటోంది. మరి షారుఖ్‌కు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి