iDreamPost

ఈ బిజినెస్ తో మహిళలకు లాభాలే లాభాలు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!

మహిళలు వ్యాపారం చేయాలనుకుంటే ఈ వ్యాపారాన్ని ట్రై చేయండి. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. ఇంటి వద్దనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు.

మహిళలు వ్యాపారం చేయాలనుకుంటే ఈ వ్యాపారాన్ని ట్రై చేయండి. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. ఇంటి వద్దనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు.

ఈ బిజినెస్ తో మహిళలకు లాభాలే లాభాలు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!

ప్రస్తుత రోజుల్లో ఖర్చులు ఎక్కువై పోతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ వైపు చాలీ చాలని జీతాలతో సతమతమవుతున్నారు. అందుకే చాలా మంది అదనపు ఆదాయం కావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా కొందరు పార్ట్ జాబ్స్ చేస్తుండగా.. మరికొందరేమో ఇంటి దగ్గరే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు బ్యూటీపార్లర్లు, కుట్టుమిషన్, మెహందీ డిజైనింగ్ ఇంకా ఇతర పనుల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మరి మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటున్నారా? మహిళల కోసం అధిక రాబడినిచ్చే బెస్ట్ బిజినెస్ అందుబాటులో ఉంది.

మహిళల ఇంటి దగ్గర ఉండి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే గిఫ్ట్ బాస్కెట్ల తయారీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. మహిళలు తమ ఖాళీ సమయాన్ని వారు అదనపు ఆదాయాన్ని సంపాదించటం కోసం వినియోగించుకోవచ్చు. వెడ్డింగ్, బేబీ షవర్స్, బర్త్ డే, వివాహ వార్షికోత్సవ పార్టీలు, తదితర వేడుకల కోసం ప్రత్యేకించి బహుమతులు ఉంటాయి. ఇలాంటి గిఫ్ట్ ఐటెమ్స్‌కు తగ్గట్లే బాక్సులు అవసరం అవుతాయి. కస్టర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బహుమతులను ఇచ్చేందుకు ఉపయోగించే బుట్టలను తయారు చేయాల్సి ఉంటుంది. రకరకాల డిజైన్లు, రంగుల్లో వినూత్నంగా బుట్టలను తయారు చేయటం ద్వారా లాభాన్ని పొందొచ్చు.

కార్పొరేట్ కంపెనీల నుంచి మొదలుకొని బయట గిఫ్ట్ షాపుల వరకు అందరూ వీటిని ప్రస్తుత కాలంలో విరివిగా వినియోగిస్తున్నారు. గిఫ్ట్ బాస్కెట్ల వ్యాపారం కోసం చాలా తక్కువగా అంటే రూ.5 నుంచి రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. మీరు తయారు చేసిన గిఫ్ట్ బాస్కెట్లను సమీపంలోని షాప్స్ కు విక్రయించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫిప్‌కార్ట్, మీషో వంటి వేదికల ద్వారా కూడా అమ్ముకోవచ్చు. డిజైన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. చేతి వృత్తుల ఉత్పత్తులకు ఈ రోజుల్లో మంచి గిరాకీ ఉంది. మరి మీరు కూడా అదనపు ఆదాయం కోరుకుంటే గిఫ్ట్ బాస్కెట్ల తయారీ బిజినెస్ బెస్ట్ అని చెప్పొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి