iDreamPost

ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదన్న ప్రభాస్

Prabhas, Kalki 2898 AD డార్లింగ్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్వకత్వలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతున్న మూవీ కల్కి 2898AD. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా, దిశా హీరోయిన్లు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Prabhas, Kalki 2898 AD డార్లింగ్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్వకత్వలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతున్న మూవీ కల్కి 2898AD. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా, దిశా హీరోయిన్లు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదన్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన లెటెస్ట్ పిక్చర్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకుడు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో ఉంటూ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన వైజయంతి మూవీస్ బ్యానర్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సుమారు రూ.600 కోట్లతో ఈ మూవీని తెరకెక్కించారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో లెజండరీ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సంగతి విదితమే. దీపికా పదుకొనే.. దిశా పటానీ హీరోయిన్లు. మే 9న రిలీజ్ చేయాల్సి ఉండగా.. జనరల్ ఎలక్షన్స్ కారణంగా జూన్ 27కి వాయిదా పడింది. ఇదిలా ఉంటే సినిమా ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జి లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఇందులో బుజ్జి అనే రొబోటిక్ పాత్రకు ప్రముఖ నటి కీర్తి సురేష్ వాయిస్ అందించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ బుజ్జి పూర్తి బాడీని పరిచయం చేశాడు బుజ్జిగాడు (ప్రభాస్). ఓ స్పెషల్ కారులో ప్రభాస్ ఎంట్రీని చూసి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ప్రభాస్ బుజ్జి కారులో వచ్చి.. కల్కి అవతారంలో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. అనంతరం ప్రభాస్.. బుజ్జిని పరిచయం చేశాడు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..‘ బుజ్జిని కలిశాను.. మా బక్క డైరెక్టర్ (నాగ్ అశ్విన్) నన్ను 3 ఇయర్స్ బుజ్జితో టార్చర్ పెట్టించాడు. నేనేదే డార్లింగ్స్ కు హాయ్ చెప్పి వెళ్లిపోదామనుకుంటే..ఈ కార్లు, ఫీట్లు చేయించాడు. బుజ్జి కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. టీజర్స్, మూవీ కోసం వెయిట్ చేస్తున్నా’ అన్నాడు ఈ పాన్ ఇండియన్ స్టార్.

అదే సమయంలో ఇటీవల ప్రభాస్.. ఓ ఇంట్రస్టింగ్ ఇన్ స్టా పోస్టు చేసిన సంగతి విదితమే. తన జీవితంలో ఓ ఇంపార్టెన్స్ వ్యక్తి రాబోతున్నారని ఎనౌన్స్ చేయగానే.. త్వరలో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, అమ్మాయిల కలల రాకుమారుడు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అది చివరకు బుజ్జి క్యారెక్టర్ గురించి అని తెలిసింది. అయితే దీనిపై ఈ లాంచ్ ఈవెంట్లో కూడా యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారని.. మీరొక ట్వీట్ చేశారు కదా..ఎంత మంది అమ్మాయిల గుండె పగిలిపోయింది తెలుసా అనగానే.. ఆ అమ్మాయిల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ మా డైరెక్టర్ ఐడియాలన్నీ అంటూ తెలిపాడు. ఈ సందర్భంగా ప్రభాస్.. అమితాబ్, కమల్ హాసన్‌కు ప్రత్యేక కృతజతలు తెలిపాడు. అలాగే దీపికా పడుకొనే, దిశానీని ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం పెళ్లిపై డార్లింగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి