iDreamPost

TGSRTCపై అసత్య ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్‌..

  • Published May 23, 2024 | 12:41 PMUpdated May 23, 2024 | 12:41 PM

MD Sajjanar Clarity: తెలంగాణ ఆర్టీసీ లోగా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ లోగో ప్రచారం అవుతుంది. తాజాగా దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

MD Sajjanar Clarity: తెలంగాణ ఆర్టీసీ లోగా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ లోగో ప్రచారం అవుతుంది. తాజాగా దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

  • Published May 23, 2024 | 12:41 PMUpdated May 23, 2024 | 12:41 PM
TGSRTCపై అసత్య ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్‌..

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   టీఎస్ స్థానంలో టీజీ అమలు కు సంబంధించిన విజ్ఙప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. తాజాగా టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చినట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ వార్తలు కాస్త వైరల్ కావడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం.. టీఎస్ పేరు ను టీజీగా మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు కేంద్రం కూడా ఓకే చెప్పి  సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారి సంక్షప్త పదం టీఎస్ నుంచి టీజీ గా మారుస్తున్నట్లు సీఎం శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఏజెన్సీలు, అధికారిక హూదాలతో పాటు ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థల బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించింది. ఇక నుంచి ప్రతి పాలసీ పేర్లు, జీవోలు, నోటిఫికేషన్లు, సర్క్యూలర్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో టీజీ వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆ లోగో ప్రచారంపై ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ‘ఇప్పటి వరకు అధికారికంగా కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో వచ్చే అసత్యం ప్రచారం నమ్మవొద్దు.. అదిఫేక్ లోగో. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందింస్తుంది.. అది ఇంకా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఫైనల్ చేయలేదు’ అంటూ ట్విట్ చేశారు ఎండీ సజ్జనార్. కాగా, సజ్జనార్ ఇచ్చిన క్లారిటీతో త్వరలోనే అధికారికంగా కొత్త లోగో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి