iDreamPost

వేసవిలో బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా.. తక్కువ పెట్టుబడితో రోజుకు రూ.5 వేల ఆదాయం పక్కా

  • Published Apr 20, 2024 | 1:26 PMUpdated Apr 20, 2024 | 1:26 PM

భారీ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే బదులు.. తక్కువ ఖర్చుతో సీజనల్‌ వ్యాపారాలు చేసుకోవడం ఎంతో బెటర్‌. అలాంటి ఓ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఆ వివరాలు..

భారీ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే బదులు.. తక్కువ ఖర్చుతో సీజనల్‌ వ్యాపారాలు చేసుకోవడం ఎంతో బెటర్‌. అలాంటి ఓ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఆ వివరాలు..

  • Published Apr 20, 2024 | 1:26 PMUpdated Apr 20, 2024 | 1:26 PM
వేసవిలో బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా.. తక్కువ పెట్టుబడితో రోజుకు రూ.5 వేల ఆదాయం పక్కా

నేటి కాలంలో ఉద్యోగం చేయాలని భావించే వారి కన్నా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే వ్యాపారం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. భారీగా పెట్టుబడి కావాలి.. కొన్నాళ్ల పాటు దాన్నుంచి ఏం ఆశించకూడదు. ఇక రాత్రింబవళ్లు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఇవన్ని చేసినా సరే.. వ్యాపారంలో విజయం సాధిస్తామా అంటే అది కూడా గ్యారెంటీగా చెప్పలేము. కానీ సీజనల్‌ బిజినెస్‌లతో ఆ భయం ఉండదు. పెట్టుబడి చాలా తక్కువ.. నష్ట పోతామనే భయం లేదు అంటున్నారు నిపుణులు. అందుకే చాలా మంది సీజనల్‌ బిజినెస్‌కు ఓటేస్తుంటారు. అలాంటి ఓ వ్యాపార ఐడియా గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీనికి పెట్టుబడి చాలా తక్కువ.. పైగా రోజుకు 4-5వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. ఇంతకు ఆ బిజినెస్‌ ఏంటి.. ఎలా ప్రారంభించాలి అంటే..

వేసవి కాలం అనగానే మనకు గుర్తుకు వచ్చే వాటిల్లో ముందు వరుసలో ఉండేది.. చెరకు రసం. వేసవి తాపానికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. అందుకే చాలా మంది చలచల్లగా చెరకు రసం తాగడానికి ఆసక్తి చూపుతారు. జ్యూస్‌లతో పోలిస్తే.. చెరకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. అందుకే చాలా మంది జ్యూస్‌లు తాగకుండా.. చెరకు రసం తాగడానికే ఇ‍ష్టపడతారు. ధర తక్కువ.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. కావడంతో.. వేసవిలో దీనికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. మరీ కనుక సీజనల్‌ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే.. చెరకు రసం బండి పెట్టుకుంటే.. బాగా కలసి వస్తుంది. దీని ద్వారా రోజుకు 4-5 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.

ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల చెరకు రసం బండ్లు కనిపిస్తాయి. గ్లాస్‌కు 20, లీటర్‌కు 90-100 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇక వీటిల్లో కూడా అనేక ఫ్లేవర్లు లభిస్తున్నాయి. జింజర్ చెరుకు రసం, సబ్జా చెరుకు రసం, పుదీనా చెరుకు రసం ఇలా అనేక ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. పరిసరాలు శుభ్రంగా ఉండి.. నాణ్యత విషయంలో రాజీ పడకపోతే.. ఈ బిజినెస్‌లో బోలేడంత లాభం. ఇక ఈ వ్యాపారం ప్రారంభించడానికి ముఖ్యంగా కావాల్సింది చెరుకు రసం తీసే మిషన్‌.

ఇవి మోడల్‌ను బట్టి.. 8 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు లభిస్తున్నాయి. ఒక్కసారి ఈ మెషిన్‌ను తీసుకుంటే.. కొన్ని సంవత్సరాల పాటు పని చేస్తుంది. ఇక మిషన్‌తో పాటు ఫ్రిజ్‌, గ్లాస్‌లు, చెరకు గడలు, ఇతర సామాగ్రి కావాలి. వీటన్నింటికి కలుపుకుంటే లక్ష రూపాయల వరకు కావొచ్చు. కానీ రోజుకు 4-5 వేల రూపాయల ఆదాయం పక్కా. డిమాండ్‌ బాగుంటే.. 7 వేల రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. 4-5 నెలల పాటు ఈ వ్యాపారం చేసుకోవచ్చు. నెల రోజుల్లోనే పెట్టుబడి రాగా.. మిగతా మూడు నెలలు లాభాల్లోనే ఉంటారు. మీరు కనక సీజనల్‌ బిజినెస్‌ చేయాలనుకుంటే.. చెరకురసం బండి పెట్టుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. మీరు దీనిపై ఓ లుక్కేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి