iDreamPost

బెంగళూరు రేవ్ పార్టీలో హేమకి కొత్త పేరు! బాగానే ఆలోచించిందిగా!

Bangalore Rave Party బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో పట్టుబడ్డ వ్యక్తుల దగ్గర నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు నార్కోటిక్ పోలీసులు. కాగా, అందరికీ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. నటి హేమకు కూడా పాజిటివ్ అని తేలిందని సమాచారం.

Bangalore Rave Party బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో పట్టుబడ్డ వ్యక్తుల దగ్గర నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు నార్కోటిక్ పోలీసులు. కాగా, అందరికీ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. నటి హేమకు కూడా పాజిటివ్ అని తేలిందని సమాచారం.

బెంగళూరు రేవ్ పార్టీలో హేమకి కొత్త పేరు! బాగానే ఆలోచించిందిగా!

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది బెంగళూరు రేవ్ పార్టీ. బర్త్ డే పార్టీ ముసుగులో వాసు అనే బిల్డర్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. 100 మందిని పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తెలుగు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్దారించారు. నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు రాగానే.. కవర్ చేసుకునేందుకు ఓ వీడియోను విడుదల చేసి.. మీడియాను తప్పుదోవ పట్టించింది ఈ నటి. వెంటనే ఆమెకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె పార్టీలో ఉందంటూ నిర్దారించారు. ఇదిలా ఉంటే అందులో పట్టుబడిన 150 మంది దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.

రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వాళ్లందరికీ పాజిటివ్ అని వచ్చింది. టెస్టుల్లో 86 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే నటి హేమకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హేమకు నోటిసులిచ్చి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా, మిగిలిన వారందరికీ కూడా నోటీసులు ఇవ్వనున్నారు. అయితే నటి హేమ పేరు మార్చుకుని రేవ్ పార్టీకి హాజరైందని తెలుస్తోంది. కృష్ణవేణి అని పేరు మార్చుకుని ఈ బర్త్ డే పార్టీలో పాల్గొంది హేమ. పోలీసులు రికార్డుల్లో ఆమె పేరు కృష్ణవేణిగా నమోదైంది. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితురాలిగా చూడటంతోనే.. హేమను కూడా పిలిచి విచారించి.. కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. కాగా, హేమ అసలు పేరు కృష్ణవేణి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండస్ట్రీలోకి వచ్చాక హేమగా మారింది. ఇక బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఒక్కొక్క నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ పార్టీ నిర్వహించిన వాసు, అతడి సోదరుడు అరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిల్డర్, బుకీగా వ్యహరిస్తున్న వాసుపై గతంలో విజయవాడలో 5 కేసులు నమోదు అయ్యాయి. గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్‌లో సన్ సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించాడు వాసు, అతని సోదరుడు. అక్కడ నానా హంగామా చేస్తుంటే.. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసుల ఎంట్రీ చోటుచేసుకుంది. పెద్ద మొత్తంలో అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు. తెలుగు సినీ, పొలిటికల్ లీడర్స్ తో పాటు కర్ణాటకకు చెందిన ప్రముఖుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. 150 మంది రక్త నమూనాలను సేకరించింది నార్కోటిక్ టీమ్. 86 మందికి పాజిటివ్ వచ్చింది. 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ పార్టీకి హాజరైన ఆషీ రాయ్ బ్లడ్ శాంపిల్స్ లో కూడా పాజిటివ్ అని తేలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం వాసు, అరుణ్, చిరంజీవితో పాటు హేమ, ఆషీ రాయ్ పేర్లు బయటకు వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి