iDreamPost

New Releases OTT Crime Thriller : OTT లోకి వచ్చేసిన ప్రసన్నవదనం మూవీ .. ఎక్కడ చూడాలంటే !

  • Published May 23, 2024 | 1:18 PMUpdated May 23, 2024 | 1:18 PM

థియేటర్ లో రిలీజ్ అయినా వారం పది రోజులలోగానే సినిమాలు ఓటీటీ లో రావడమే విశేషం అనుకుంటే.. వాటిలో కొన్ని సినిమాలు ఏకంగా చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓ రోజు ముందే ఓటీటీ లోకి వచ్చేసింది.

ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ తో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లోకి వచ్చేశాయి. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులందరిని ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే థియేటర్ లో రిలీజ్ అయినా వారం పది రోజులలోగానే సినిమాలు ఓటీటీ లోకి రావడం. ఇప్పుడు ఇంకాస్త ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే.. ఆయా సినిమాలు చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓ రోజు ముందే ఓటీటీ లోకి వచ్చేసింది. దీనితో ఓటీటీ మూవీ లవర్స్ ఖుషి అయిపోతున్నారు. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం. ఈ సినిమాలో హీరో రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. అతను ఫేస్ బ్లైండ్ నెస్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దీనితో ఎవరిని సరిగా గుర్తుపట్టలేకపోతాడు. కానీ, అతని సమస్యను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో అతని కళ్ళ ముందు ఓ హత్య జరుగుతుంది. అతనికి ఉన్న లోపం వలన ఆ హత్య చేసిన వారిని అతను గుర్తుపట్టలేకపోతాడు. కానీ దాని గురించి మాత్రం పోలీసులకు చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది! కథ ఎలా ముందుకు సాగింది ! అనేదే ఈ సినిమా కథ. అసలు ఫేస్ బ్లైండ్ నెస్ అనేదే ఓ కొత్త రకమైన కాన్సెప్ట్. ఇప్పటివరకు ఇలాంటి కథను మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులంతా కూడా ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

ఈ సినిమా కథను బట్టి గుర్తుపట్టేయొచ్చు ఈ సినిమా ఏంటి అనేది. ఈ సినిమా మరేదో కాదు సుహాస్ నటించిన ప్రసన్నవదనం సినిమా. ఈ సినిమా మే 3 న థియేటర్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి కూడా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు మే 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అయిపోయింది. కానీ ఆహ గోల్స్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రం.. మే 23 నుంచే అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి ఓ రోజు ముందు నుంచే ఈ సినిమాను ఓటీటీ లో చూసేయొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి