iDreamPost
android-app
ios-app

Chandini Chowdary: చాందినీ చౌదరిపై మండిపడుతున్న SRH ఫ్యాన్స్.. ఓ రేంజ్​లో ట్రోల్స్!

  • Published Apr 29, 2024 | 7:52 PM Updated Updated Apr 29, 2024 | 7:52 PM

టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరిపై సన్​రైజర్స్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె మీద భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరిపై సన్​రైజర్స్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె మీద భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 29, 2024 | 7:52 PMUpdated Apr 29, 2024 | 7:52 PM
Chandini Chowdary: చాందినీ చౌదరిపై మండిపడుతున్న SRH ఫ్యాన్స్.. ఓ రేంజ్​లో ట్రోల్స్!

ఐపీఎల్-2024 మొదలవడానికి ముందు సన్​రైజర్స్ హైదరాబాద్ మీద ఎవరికీ పెద్దగా ఎక్స్​పెక్టేషన్స్ లేవు. సొంత అభిమానులు కూడా ఎస్​ఆర్​హెచ్​ ఈసారి వండర్స్ చేస్తుందని ఆశలు పెట్టుకోలేదు. గత కొన్ని సీజన్లుగా టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తుండటమే దీనికి కారణం. అయితే కొత్త కెప్టెన్ కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీ రాత మారిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్ లాంటి డేంజరస్ ప్లేయర్ల అండతో ఎస్​ఆర్​హెచ్​కు వరుస విజయాలు అందించాడు కమిన్స్. గత రెండు మ్యాచుల్లో ఆర్సీబీ, సీఎస్​కే చేతుల్లో ఓడిపోయినా టీమ్ కాంబినేషన్ బాగుంది, కొండంత అండ లాంటి కెప్టెన్ ఉన్నాడు కాబట్టి ఈసారి ఐపీఎల్​ కప్పు మనదేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ టైమ్​లో టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

టాలీవుడ్ భామ చాందినీ చౌదరిపై సన్​రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సీరియస్​గా ఉన్నారు. ఆమె మీద ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చాందినీని ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఓ మూవీ ఫంక్షన్​లో ఎస్​ఆర్​హెచ్​ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్. ‘మ్యూజిక్​షాప్ మూర్తి’ అనే కొత్త సినిమాతో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు చాందినీ. అయితే ఈ సినిమా టీజర్ లాంఛ్​ ఈవెంట్​లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. ఓ యాంకర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ సీజన్ నడుస్తోంది, మెగా లీగ్​లో మీకు ఏ టీమ్ అంటే ఇష్టం? అని చాందినీని అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ.. తనకు జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉందన్నారు.

స్టేడియంలో లైవ్​గా మ్యాచ్ చూశాక ఫేవరెట్ టీమ్ ఏది అనేది సెలెక్ట్ చేసుకుంటానని చాందినీ చెప్పారు. ‘జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉంది. మ్యాచ్ చూసి అప్పుడు సెలెక్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మాది ఆంధ్రా కదా, ఆంధ్రాకు టీమ్ లేదు’ అని చాందినీ స్పష్టం చేశారు. అయితే తెలుగు టీమ్​గా సన్​రైజర్స్ ఉంది కదా అని యాంకర్ ఆమెను అడగ్గా.. ఆమె మళ్లీ అదే ఆన్సర్ ఇచ్చారు. తనది ఆంధ్రా అని, ఆంధ్రాకు టీమ్ లేదన్నారు. చాందినీ వ్యాఖ్యలపై ఎస్​ఆర్​హెచ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అలా ఎలా అంటారని.. సన్​రైజర్స్ రెండు రాష్ట్రాల జట్టు కదా, అది తెలుగువాళ్ల టీమ్ అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ చేయకపోయినా ఫర్వాలేదని, కానీ ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. మరి.. ఎస్​ఆర్​హెచ్​పై చాందినీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Sanju Samson: సంజూ ఫ్యాన్స్​కు అదిరిపోయే న్యూస్.. దీని కోసమే ఏళ్లుగా ఎదురుచూశారు!

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet