iDreamPost

శ్రీలీల ఆ స్టార్ డైరెక్టర్ కి కోడలు అవుతుందట! ఎవరికో తెలుసా?

  • Author ajaykrishna Published - 01:53 PM, Mon - 16 October 23
  • Author ajaykrishna Published - 01:53 PM, Mon - 16 October 23
శ్రీలీల ఆ స్టార్ డైరెక్టర్ కి కోడలు అవుతుందట! ఎవరికో తెలుసా?

ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ రావడం అనేది కామన్. హీరోలంటే సీనియర్ హీరోలకు వారసులుగా.. లేదా ఆల్రెడీ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ఫ్యామిలీ నుండి వస్తుంటారు. అందరు కాదు.. మాక్సిమమ్ అలాగే జరుగుతుంది. కానీ.. హీరోయిన్స్ విషయానికి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు ఎక్కువ. పేరుకు తెలుగు ఇండస్ట్రీ అయినా.. స్టార్డమ్ పొండేవాళ్ళు దాదాపు వేరే భాషలవాళ్లే. అయితే.. కొన్నిసార్లు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆ తర్వాత ఏదొక సందర్బంలో తమకు కూడా రిలేటివ్స్ ఉన్నారని.. రిలేటివ్స్ అవుతారని తెలిస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల.. అలాంటి ఆనందంలోనే ఉంది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో బిజీ అవుతున్న ఈ భామ.. చేతిలో పది వరకు సినిమాలు లైనప్ చేసి పెట్టుకుంది. ఒక్కో సినిమాను ఫినిష్ చేస్తూ.. నెలకో సినిమా చొప్పున రిలీజ్ చేస్తోంది. అయితే.. గత నెలలో స్కందతో పలకరించిన శ్రీలీల.. ఇప్పుడు దసరాకు బాలయ్య భగవంత్ కేసరి మూవీతో రెడీ అయిపోయింది. అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. అయితే.. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో శ్రీలీలకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయట పడింది. అదేంటంటే.. శ్రీలీలకు ఓ స్టార్ డైరెక్టర్ మామ అవుతాడట.

అవును.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఎందుకంటే.. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు, శ్రీలీలనే చెప్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్ అనిల్ రావిపూడినే శ్రీలీలకు రిలేటివ్ అవుతాడట. అనిల్, శ్రీలీల వాళ్ళ అమ్మ గారిది ఒకే ఊరట. ఒంగోలు దగ్గర పొంగులూరు. శ్రీలీల బెంగుళూరు, అమెరికాలో పెరిగినా.. అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చేదట. శ్రీలీల వాళ్ల అమ్మ అనిల్ కి వరుసకు అక్క అవుతుందట. అలా వీరిద్దరూ మామ కోడలు అవుతారని అనిల్ రావిపూడినే చెప్పినట్లు సమాచారం. షూటింగ్ టైమ్ లో సొంతూరు గురించి మాట్లాడుకునే సందర్బంలో ఈ విషయం తెలిసిందని.. అనిల్ ని షూటింగ్ సెట్ లో డైరెక్టర్ గారు అని, బయట మామ అని పిలుస్తానంటూ శ్రీలీల చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి శ్రీలీల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి