iDreamPost

కోరుకున్న ప్రియుడిని పెళ్లాడనున్న స్టారో హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే?

  • Published Jun 10, 2024 | 11:36 AMUpdated Jun 10, 2024 | 11:36 AM

Actress Sonakshi Sinha: చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతోమంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం రిలేషన్ లో ఉంటూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.

Actress Sonakshi Sinha: చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతోమంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం రిలేషన్ లో ఉంటూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.

  • Published Jun 10, 2024 | 11:36 AMUpdated Jun 10, 2024 | 11:36 AM
కోరుకున్న ప్రియుడిని పెళ్లాడనున్న స్టారో హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే?

సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి కొంత కాలం రిలేషన్ షిప్‌లో ఉండి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంతమంది డేటింగ్ చేసి విభేదాల కారణంగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఎక్కువ శాతం నటీనటులు ప్రేమ వివాహాలే చేసుకున్నారు. తాజాగా అలాంటి వారి లీస్టు‌లో చేరింది స్టార్ హీరో, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా. గతంలో రజినీకాంత్ నటించిన ‘లింగ’ చిత్రంతో హీరోయిన్ గా నటించిన సోనాక్షి ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్, వెబ్ సీరీస్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు తాను కోరుకున్న ప్రియుడితో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హిరామండి ఫేమ్ నటి సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. తన సహనటుడు జహీర్ ఇక్బాల్ ని పెళ్లాడబోతున్నట్లు.. అది కూడా ఈ నెల 23న ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం ముంబైలోనే జరగనుంది. కొంత కాలంగా సోనాక్షి, జహీర్ సహజీవనం చేస్తున్నారు. కానీ ఎక్కడ తమ ఫోటోలు కానీ, వీడియోలు కానీ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. అయితే పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు పెళ్లి పేటలెక్కబోతున్నారు . ఇటీవల బాలీవుడ్ లో వరుసగా సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని ఒకింటివారు అవుతున్నారు.

ప్రముఖ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా ముద్దుల కూతురు సోనాక్షి సిన్హా. కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా  కెరీర్ ప్రారంభించి 2010లో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ మూవీతో హీరోయిన్ గా ఎట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రౌడీ రాథోడ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు యాడ్స్, వెబ్ సీరీస్ లో నటిస్తుంది. గత కొంత కాలంగా జహీర్ ఇక్బాల్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది.. కానీ వీరి విషయం మీడియా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల సోనాక్షీ సిన్హా పుట్టిన రోజు సందర్భంగా జహీర్ ఇన్‌స్టా వేధికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ జంట పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా.. జంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన వెబ్ సీరీస్ ‘హీరామండి’లో కీలక పాత్ర పోషిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి