iDreamPost

వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి పాజిటీవ్

వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి పాజిటీవ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు ఉద్ధృత రూపం దాలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1101 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు.మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది.

ఇప్పటికే రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 279 కరోనా కేసులు నమోదయ్యాయి.అయితే తాజాగా వెలుగు చూసిన ఒక విషయం జిల్లాలో సంచలనం రేపింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని ఎంపీ సంజీవ్ స్వయంగా మీడియాకు తెలిపారు.

కర్నూలు ఎంపీ ఇంట్లో వైరస్ సోకిన వారిలో ఆయన తండ్రి,ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, ఒకరి కుమారుడు(14) ఉన్నారు.83ఏళ్ల ఆయన తండ్రి పరిస్థితి కొంత సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులే కావడంతో జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమౌతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి