iDreamPost

నిర్మాతపై సీరియస్ అయిన సముద్రఖని.. అంత ధైర్యం ఎక్కడిదంటూ..!

  • Author singhj Published - 05:08 PM, Sun - 26 November 23

స్టార్ ప్రొడ్యూసర్​పై యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని సీరియస్ అయ్యారు. నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఫైర్ అయ్యారు.

స్టార్ ప్రొడ్యూసర్​పై యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని సీరియస్ అయ్యారు. నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఫైర్ అయ్యారు.

  • Author singhj Published - 05:08 PM, Sun - 26 November 23
నిర్మాతపై సీరియస్ అయిన సముద్రఖని.. అంత ధైర్యం ఎక్కడిదంటూ..!

సముద్రఖని.. తెలుగు ఆడియెన్స్​కు పరిచయం అక్కర్లేని పేరిది. డైరెక్టర్​గా, యాక్టర్​గా కోలీవుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ ఆయన మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్ కలయికలో తెరకెక్కిన ‘శంభో శివ శంభో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. అయితే మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్నా వసూళ్లలో మాత్రం వెనుకబడింది. ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయిపోయిన ఆయన తెలుగులో నటుడిగా మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డైరెక్టర్​గా గాక యాక్టర్​గానే ఆయనకు ఇక్కడ మంచి ఆదరణ దక్కింది. రవితేజ ‘క్రాక్​’ మూవీతో ఆయన ఇక్కడ సెటిలైపోయారు.

‘సర్కారు వారి పాట’, ‘అల వైకుంఠపురం’, ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘గాడ్​ఫాదర్’, ‘విమానం’ చిత్రాలు సముద్రఖనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇటీవల మరోమారు దర్శకుడిగా మారి పవర్​స్టార్ పవన్ కల్యాణ్​తో ‘బ్రో’ సినిమాను తీశారాయన. అలాంటి ఆయన ఓ స్టార్ ప్రొడ్యూసర్​పై సీరియస్ అయ్యారు. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా మీద సముద్రఖని ఫైర్ అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన ఫస్ట్ ఫిల్మ్ ‘పరుత్తివీరన్’. 16 ఏళ్ల కింద రిలీజైన ఈ మూవీ విషయంలో కొన్ని రోజుల నుంచి చిత్ర దర్శకుడు ఆమిర్​కు ప్రొడ్యూసర్​ జ్ఞానవేల్​కు మధ్య కాంట్రవర్సీ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్​కు మద్దతుగా నిలిచిన సముద్రఖని.. తాజాగా ఒక లెటర్​ను విడుదల చేశారు. ‘పరుత్తివీరన్​’లో తాను యాక్ట్ చేశానన్నారు. ఆ ఫిల్మ్ తీయడానికి దర్శకుడు ఆమిర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని అన్నారు.

జ్ఞానవేల్ రాజా మాత్రం ఒక్క రోజు కూడా ‘పరుత్తివీరన్’ సెట్​కు వచ్చింది లేదన్నారు సముద్రఖని. మూవీ బడ్జెట్ విషయంలోనూ డైరెక్టర్​కు ఆయన సహకరించలేదన్నారు. ‘పరుత్తివీరన్​లో నేనూ యాక్ట్ చేశా. ఆ సినిమా టైమ్​లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దర్శకుడు ఆమిర్​కు నువ్వు (నిర్మాత జ్ఞానవేల్ రాజాను ఉద్దేశించి..) ఏమాత్రం సహకరించలేదు. నా దగ్గర డబ్బుల్లేవ్.. నేను ఈ మూవీ చేయనని షూటింగ్ మధ్యలోనే చేతులెత్తేశావ్. కానీ బంధువుల వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ ఆమిర్ చిత్రాన్ని పూర్తి చేశాడు. దీనికి నేనే సాక్ష్యం. అతను ఎంతో కష్టపడి సినిమా పూర్తి చేస్తే ప్రొడ్యూసర్ అనే క్రెడిట్ నువ్వు పొందావ్. ఈ రోజు నువ్వు డైరెక్టర్​ను తప్పబడుతూ కామెంట్స్ చేస్తున్నావ్. ఇది అస్సలు బాగోలేదు. నీకు ఇంత ధైర్యం ఎక్కడిది?’ అని సముద్రఖని ప్రశ్నించారు.

సముద్రఖని రాసిన లేఖ తమిళ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కాగా, కార్తి నటించిన రీసెంట్ మూవీ ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ఆయనతో పనిచేసిన దర్శకులందరూ వచ్చారు. కానీ ఆమిర్ మాత్రం రాలేదు. దీనిపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఆహ్వానం అందనందునే ‘జపాన్’ ఈవెంట్​కు రాలేదన్నారు. దీని మీద జ్ఞానవేల్ రాజా రియాక్ట్ అవుతూ.. ఆహ్వానం పంపామని.. కానీ రాలేదన్నారు. ‘పరుత్తివీరన్’ విషయంలో తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. దీంతో ఆ ఫిల్మ్​కు పనిచేసిన సముద్రఖని తాజాగా బహిరంగ లేఖ రాశారు. మరి.. నిర్మాతపై సముద్రఖని సీరియస్ అవ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రజినీకాంత్ ను దాటేస్తున్న ఐకాన్ స్టార్! ఏ విషయంలో అంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి