iDreamPost

Sameera Reddy: వాళ్లంతా సైజులు పెంచుకోమ‌ని.. నరకం చూపించారు: సమీరా రెడ్డి

  • Published Feb 27, 2024 | 5:09 PMUpdated Feb 27, 2024 | 5:58 PM

సినిమా రంగంలోకి అడుగు పెట్టాలంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అలా సినీ రంగంలో తన కెరీర్ లో ఎదుర్కున్న కొన్ని సంఘటనలను.. నటి సమీరా రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సినిమా రంగంలోకి అడుగు పెట్టాలంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అలా సినీ రంగంలో తన కెరీర్ లో ఎదుర్కున్న కొన్ని సంఘటనలను.. నటి సమీరా రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  • Published Feb 27, 2024 | 5:09 PMUpdated Feb 27, 2024 | 5:58 PM
Sameera Reddy: వాళ్లంతా సైజులు పెంచుకోమ‌ని.. నరకం చూపించారు: సమీరా రెడ్డి

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో సమీరా రెడ్డి ఒకరు. సూర్య s/o కృష్ణన్ సినిమాలో సమీరా రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సమీరా రెడ్డి.. ఈ మధ్య కాలంలో సరిగ్గా సినిమాలలో కనిపించడంలేదని చెప్పి తీరాలి. అయితే, సినిమాలకు రావాలంటే ఎవరైనా కూడా కష్టాలను ఎదుర్కోవాల్సిందే. అందులోను ఓ మంచి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవాలంటే మాత్రం వారు ఎన్నో అవమానాలను .. కష్టాలను చూసి ఉంటారు. అలానే, సమీరా రెడ్డి కూడా తన కెరీర్ బిగినింగ్ లో కొన్ని అవమానాలను ఎదుర్కొందట.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి తన సినీ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే, సమీరా రెడ్డి బాడీ పోజిటివిటీ గురించి చాలా సార్లు మాట్లాడారు, సినీ రంగంలో తన కెరీర్ ఎదుగుదల కోసం .. కొన్నిటిని త్యాగం చేశానని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కొన్ని సంధర్భాలలో తానూ చాలా ఇన్సెక్యూరిటీస్ కి గురి అవ్వాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. తాజాగా టీవీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి .. బాడీ షేమింగ్ గురించి ప్రస్తావించారు. తన 40 ఏళ్ళ కెరీర్ లో ఎదుర్కున్న ఒత్తిళ్ల గురించి సమీరా ఇలా చెప్పుకొచ్చారు.

“ఒకానొక స‌మ‌యంలో ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉండటానికి.. నా మానసిక , శారీరిక ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాను. నేను సైజుల కోసం ఫ్యాడ్ లను ప్రయత్నించాను.. షూట్ తర్వాత వ్యాయామం చేయడం వంటివి చాలా హాస్యాస్పదమైన పనులు చేశాను. అప్పుడు నేను చేసిన దాని ఫలితంగా ఇప్పుడు హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడింది. పర్యవసానాలు వయస్సుతో పాటుగా ఉంటాయి.. ఈ రోజు అలాంటి ఆప్షన్ ను ఎన్నుకున్నందుకు బాధపడుతున్నాను. కానీ, అప్పటికి నాకు మరే ఇతర ఆప్షన్ లేదు. ఇతరుల నుంచి నేను పొందిన పరిశీలన కంటే.. నాకు నేనుగా చేసుకున్న పరిశీలనలు నాకు బాగా ఉపయోగపడేవి. యంగ్ ఏజ్ లో ఉన్నపుడు నేను బొద్దుగా ఉండే అమ్మాయిని. అందంగా ఉండడం కోసం ఆ ఏజ్ లో ఉన్న అమ్మాయిలంతా కష్టపడుతుంటే.. నేను మాత్రం వారందరికీ భిన్నంగా ఉండేదాన్ని.

ఆ తర్వాత నటిగా మారిన తర్వాత నాలో ఇన్సెక్యూరిటీస్ బాగా పెరిగిపోయాయి. నేను ముదురు రంగు చర్మంతో, బొద్దుగా, మందపాటి అద్దాలు ధరించి, అందవిహీనంగా ఉండేదాన్ని. స్ట్రెచ్ మార్క్స్, గ్రే హెయిర్, హార్మోన్ల అసమతుల్యత గురించి చర్చించడానికి .. సోషల్ మీడియా నన్ను అనుమతించింది. నేను ఇప్పటివరకు ఎదుర్కొన్న ఎన్నో అనుభవాల గురించి.. సోషల్ మీడియాలో చర్చించడం ప్రారంభించాను. మొదట్లో ప్రజలు సానుకూలంగా స్పందించలేదు. అయితే, నేను వ్యక్తులను నిందించను.. అందం కోసం వారు చేసే ప్రయత్నాలను కూడా ఆపను. అది ఎవరికీ వారు నిర్ణయించుకునేది. నేడు అన్ని పరిస్థితులు మారాయి. ఎవరు పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉండనవసరం లేదు.” అంటూ సమీరా పేర్కొన్నారు. మరి, నటి సమీరా రెడ్డి చర్చించిన తన వ్యక్తిగత విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి