iDreamPost

భారీ ధరకు సలార్ డిజిటల్ రైట్స్! అసలు లెక్క ఇదా.. అదా?

  • Author ajaykrishna Published - 03:08 PM, Fri - 15 September 23
  • Author ajaykrishna Published - 03:08 PM, Fri - 15 September 23
భారీ ధరకు సలార్ డిజిటల్ రైట్స్! అసలు లెక్క ఇదా.. అదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘సలార్’. కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న మూవీ.. పైగా ప్రభాస్ హీరో అయ్యేసరికి సలార్ క్రేజ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా సలార్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమా.. అనూహ్య కారణాల వల్ల వాయిదా పడినట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఎంతో ఆశగా ఎదురు చూసిన సినిమా వాయిదా పడేసరికి ఒక్కసారిగా నిరాశకు గురైపోయారు ఫ్యాన్స్. ప్రస్తుతం సలార్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కాగా.. సలార్ రిలీజ్ వాయిదా పడిందని బాధలో ఉన్న ఫ్యాన్స్ కి డిజిటల్ రైట్స్ విషయం కాస్త ఊరట నిచ్చిందని చెప్పాలి. ఇప్పటిదాకా సలార్ నుండి కేవలం టీజర్ మాత్రమే విడుదలైంది. ఆ ఒక్క టీజర్ తో వరల్డ్ వైడ్ షేక్ చేసేసింది సలార్. పైగా టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం కేజీఎఫ్ లాంటి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయి. రవి బస్రూర్ బిజీఎం బాగా ఎక్కేసింది. ఇంకేముంది.. ఒకేసారి సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి. రిలీజ్ డేట్ ఇంకా నెల ఉందనగా.. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. కానీ.. కట్ చేస్తే.. రిలీజ్ వాయిదా పడి మొత్తం ఫ్యాన్స్ నీరుగారిపోయారు.

ఇదిలా ఉండగా.. సలార్ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు రెండు రోజులుగా వార్తలు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కేవలం సౌత్ వరకు నెట్ ఫ్లిక్స్ బిగ్ డీల్ కు కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే.. ఆ డీల్ ఎన్ని కోట్లకు జరిగింది? అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. సలార్ సౌత్ లాంగ్వేజెస్ ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 350 కోట్లకు కొనుగోలు చేసిందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సలార్ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్.. రూ. 162 కోట్లు పెట్టి సౌత్ వరకు సొంతం చేసుకుందని సమాచారం. దీంతో రెండిట్లో ఏది కరెక్ట్ అనేదానిపై ఫ్యాన్స్ లో కన్ఫ్యూషన్ మొదలైంది. ఇంతకీ సలార్ డిజిటల్ రైట్స్ విషయంలో రూ. 350 కోట్లు కరెక్టా? లేక రూ. 162 కోట్లు కరెక్టా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి