iDreamPost
android-app
ios-app

Rihanna, Janhvi Kapoor: వీడియో: రిహానాతో కలిసి NTR హీరోయిన్‌ హాట్‌ డ్యాన్స్‌!

  • Published Mar 02, 2024 | 1:11 PMUpdated Mar 02, 2024 | 2:08 PM

పాప్‌ స్టార్‌ రిహానాతో కలిసి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హాట్‌ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ ఇద్దరు ‍బ్యూటీస్‌ కలిసి.. డ్యాన్స్‌ చేస్తుంటే.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వీరిద్దరి డ్యాన్స్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పాప్‌ స్టార్‌ రిహానాతో కలిసి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హాట్‌ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ ఇద్దరు ‍బ్యూటీస్‌ కలిసి.. డ్యాన్స్‌ చేస్తుంటే.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వీరిద్దరి డ్యాన్స్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 02, 2024 | 1:11 PMUpdated Mar 02, 2024 | 2:08 PM
Rihanna, Janhvi Kapoor: వీడియో: రిహానాతో కలిసి NTR హీరోయిన్‌ హాట్‌ డ్యాన్స్‌!

బాలీవుడ్‌ స్టార్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హాట్‌ డ్యాన్స్‌తో రెచ్చిపోయింది. అది కూడా వరల్డ్‌ పాప్‌ సూపర్‌ స్టార్‌ రిహానాతో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతం వీరిద్దరి హాట్‌ హాట్‌ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. అయితే వీరిద్దరు ఎక్కడ కలిసి డ్యాన్స్‌ వేశారు? ఏ సినిమాలోనైనా కలిసి చేస్తున్నారా? అనే డౌట్‌ తెచ్చుకోకండి. అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా.. రిహానా, జాన్వీ కపూర్‌ ఇలా సరదాగా డ్యాన్స​్‌ వేస్తూ అలరించారు. అయితే.. ఇద్దరూ బ్యూటీ క్వీన్స్‌ కావడంతో వారి డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహ వేడుకల్లో భాగంగా.. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే ఏకంగా 50 వేల మంది పేదలకు అన్నసేవ పేరుతో అన్నదానం చేసిన ముఖేష్‌ అంబానీ కుటుంబం. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల ప్రముఖలను జామ్‌నగర్‌కు ఆహ్వానించి.. ప్రీ వెడ్డింగ్‌ను గతంలో కనీవినీ ఎరుగని విధంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంబానీ ఇంట పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు.

ఈ వేడుకలకు బాలీవుడ్‌ తారాగణం మొత్తం కదిలిపోయింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లతో పాటు వివిధ దేశాల క్రికెటర్లు, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజ్‌కి ఆడుతున్న ఆటగాళ్లు ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు హాజరయ్యారు. అలాగే మన టాలీవుడ్‌ నుంచి రామ్‌చరణ్‌ దంపతులు, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ వేడుకలకు బయలుదేరి వెళ్లారు. బాలీవుడ్‌ నుంచి.. షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, శ్రద్ధా కపూర్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ, క్రికెటర్లు.. ధోని, సచిన్‌, రోహిత్‌, పాండ్యా, ఇషాన్, బ్రావో, బౌల్ట్‌, టిమ్‌ డేవిడ్‌ ఇలా అనేక మంది ప్రముఖులు జామ్‌నగర్‌కు చేరుకున్నారు. మరి ఈ వేడుకల్లో జాన్వీ కపూర్‌, రిహానా డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి