iDreamPost

రూ.7 లక్షలకే మిడిల్ క్లాస్ కు ఇన్నోవా తరహా కారు.. మరిన్ని ఫీచర్లతో!

Renault Triber 2024 Features: మిడిల్ క్లాస్ వారికోసం మార్కెట్ లో అందుబాటులో ఉన్న బడ్జెట్ కారు.. ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో మరోసారి విడుదల అవుతోంది.

Renault Triber 2024 Features: మిడిల్ క్లాస్ వారికోసం మార్కెట్ లో అందుబాటులో ఉన్న బడ్జెట్ కారు.. ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో మరోసారి విడుదల అవుతోంది.

రూ.7 లక్షలకే మిడిల్ క్లాస్ కు ఇన్నోవా తరహా కారు.. మరిన్ని ఫీచర్లతో!

సాధారణంగా అందరూ కారు కొనాలి అనుకుంటారు. కానీ, మిడిల్ క్లాస్ వాళ్లు మాత్రం బడ్జెట్ లో మంచి కారు కొనాలి అనుకుంటారు. కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోయి నచ్చకపోయినా వచ్చిన కారునే కొంటూ ఉంటారు. కానీ, ఇప్పుడు అలాంటి వారికోసం మార్కెట్ లో బడ్జెట్ లోనే బెస్ట్ కార్లు ఉన్నాయని తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా మనకు సెట్ కాదేమో అని వదిలేస్తూ ఉంటారు. కానీ, అలాంటి వారు ఈ కారు గురించి ఒకసారి తప్పకుండా తెలుసుకోండి. ఇది మిడిల్ క్లాస్ కి ఒక ఇన్నోవా కారు లాంటిది. ఇందులో అదిరిపోయే ఫీచర్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు 2024లో అవి మరింత పెరిగాయి కూడా. మనం చెప్పుకుంటోంది రెనాల్ట్ ట్రైబర్ గురించి. ఇప్పటికే ఈ కారుకు ఎతో డిమాండ్ ఉంది. ఇప్పుడు 2024లో రెట్టించిన ఫీచర్లతో మరోసారి వచ్చేసింది.

రెనాల్ట్ ట్రైబర్ కారుని మిడిల్ క్లాస్ ఇన్నోవా అని పిలుస్తారు. ఎందుకంటే మీకు ఒక హ్యాచ్ బ్యాక్ ధరలోనే 7 సీటర్ కారు వచ్చేస్తోంది. అంత తక్కువకు వస్తోంది కదా.. తీసి పారేయకండి. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, లుక్స్ విషయంలో ఇది ప్రీమింయం కార్లకు పోటీగా నిలుస్తుంది. నిజంగా బడ్జెట్ లో ఎస్యూవీ కొనాలి అనుకునే వారికి ఈ 7 సీటర్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. రెనాల్ట్ కంపెనీ వాళ్ల కార్లలో క్విడ్, కిగర్, ట్రైబర్ మోడల్స్ ని రీఫ్రెష్ చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ట్రైబర్ 2024 మోడల్ సరికొత్త ఫీచర్స్, కలర్స్, లుక్స్ తో వచ్చేస్తోంది. ఈ ట్రైబర్ మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. RXE, RXL, RXT, RXZ అనే వేరియంట్స్ తో వస్తోంది.

ఈ మోడల్ ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే.. డ్యూయల్ టోన్ లో ఉండే ఎక్స్ టీరియర్ లుక్స్ ఎంతో స్టన్నింగ్ గా ఉన్నాయి. గ్రిల్, హెడ్ ల్యాంప్స్ డిజైన్ ఆకట్టుకుంటున్నాయి. ఇంటీరియర్ పరంగా కూడా అప్ డేట్స్ అయితే జరిగాయి. ఇందులో కొత్తగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తోంది. దీనిని కింగర్ నుంచి తీసుకున్నారు. అలాగే డ్రైవర్ ఆర్మ్ రెస్ట్, వైర్ లెస్ ఛార్జర్, పవర్డ్ అవుటర్ రేర్ వ్యూ మిర్రర్స్ కూడా ఉంటున్నాయి. ఇప్పటికే రెనాల్ట్ ట్రైబర్ లో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుటు వాటికి అదనంగా స్టెల్త్ బ్లాక్ ఎక్స్ టీరియర్ హ్యూ కలర్ తో వస్తోంది. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ మోడల్ నే ఎక్కువ హైలెట్ చేస్తోంది.

రెనాల్ట్ ట్రైబర్ ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తోనే ఈ సరికొత్త ట్రైబర్ వస్తోంది. ఇందులో 5 గేర్ బాక్స్ మాన్యూవల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 72బీహెచ్ పీ/ 96 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక ధర విషయానికి వస్తే.. రెనాల్ట్ ట్రైబర్ బేస్ మోడల్ RXE MT వర్షన్ ఎక్స్ షో రూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. హైఎండ్ మోడల్ RXZ AT వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ.8.74 లక్షలుగా ఉంది. ఈ కారును రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆన్ రోడ్ ప్రైస్ తో కొనుగోలు చేయచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే.. ట్రైబర్ కు గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 4 స్టార్ రేటింగ్ దక్కింది. అంటే ఇది కచ్చితంగా మీ కుటుంబానికి సేఫెస్ట్ వెహికల్ అనే చెప్పచ్చు. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు రూ.19 కిలో మీటర్ల వరకు మైలేజ్ ని అందిస్తుంది. మరి.. ఈ మిడిల్ క్లాస్ ఇన్నోవా తరహా కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి