iDreamPost

క్రెడిట్- డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త చెప్పిన RBI!

క్రెడిట్- డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త చెప్పిన RBI!

ఇప్పుడు అన్నీ బ్యాంకు లావాదేవీలు, డిజిటిల్ చెల్లింపులే అయిపోయాయి. ప్రభుత్వాల చర్యలతో దాదాపుగా అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. మరి.. బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే మీ దగ్గర కచ్చితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉంటాయి. వాటిని వినియోగిస్తూనే ఉంటారు. అలాంటి డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్తను తీసుకొచ్చింది. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలాంటి సమస్యలు రావని స్పష్టం చేసింది.

సాధారణంగా క్రెడిట్, డెబిట్ కార్డులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జారీ చేస్తాయి. అయితే బ్యాంకులు, మరే ఆర్థిక సంస్థలు కూడా నేరుగా వాటిని సంబంధించిన సేవలను నిర్వహించవు. అందుకోసం కొన్ని నెట్ వర్క్స్ ఉంటాయి. ఉదాహరణకు వీసా, రూపే, మాస్టర్ కార్డ్ వంటివి అనమాట. ఒకసారి మీకు ఆ సర్వీస్ లో ఒక కార్డు జారీ అయితే మీరు దాని నెట్ వర్క్ ని మార్చుకునేందుకు ఆస్కారం ఉండదు. మీకు ఇష్టం లేకపోతే ఆ కార్డుని వదులుకోవాల్సిందే తప్ప మార్చుకునేందుకు వీలు లేదు. కానీ, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి వినియోగాదారులు ఏ నెట్ వర్క్ కి నచ్చితే ఆ నెట్ వర్క్ కి మారేందుకు వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది.

అంతేకాకుండా కార్డు జారీ సమయంలో ఎలాంటి అగ్రిమెంట్లు చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే అదే నెట్ వర్క్ లో కొనసాగాలంటూ చెప్పకూడదని, నెట్ వర్క్ మారే సమయంలో అడ్డుకోకూడదని వెల్లడించింది. ఆర్బీఐ రూల్స్ కి అనుగుణంగానే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అంటే మీకు మీ కార్డు నెట్ వర్క్ ని మార్చుకునేందుకు వీలు లేదు. కానీ, ఆగస్టు నుంచి మీకు నచ్చిన నెట్ వర్క్ లోకి మీరు మారచ్చు. భారత్ లో మొత్తం వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్ అనే 5 నెట్ వర్క్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన నెట్ వర్క్ ని సెలక్ట్ చేసుకుని క్రెడిట్, డెబిట్ కార్డులను వాడుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి