iDreamPost

Mr.Bachchan Show Reel: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘MR. బచ్చన్’ షో రీల్! ఒక్క డైలాగ్ లేకుండా మాస్ మహారాజా బీభత్సం

డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'MR. బచ్చన్'. మూవీ యూనిట్ 'మిస్టర్ బచ్చన్ షో రీల్' అనే పేరుతో ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ షో రీల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'MR. బచ్చన్'. మూవీ యూనిట్ 'మిస్టర్ బచ్చన్ షో రీల్' అనే పేరుతో ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ షో రీల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Mr.Bachchan Show Reel: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘MR. బచ్చన్’ షో రీల్! ఒక్క డైలాగ్ లేకుండా మాస్ మహారాజా బీభత్సం

మాస్ మహారాజా రవితేజ.. సంవత్సరానికి రెండు, మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటడన్న పేరుంది. అందుకు తగ్గట్లుగానే వరుసబెట్టి మూవీలను అభిమానుల ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఇండస్ట్రీలో రవితేజతో సినిమా చేస్తే.. నష్టపోము అన్న నమ్మకం ప్రొడ్యూసర్స్ లో ఉంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘MR. బచ్చన్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల దశలో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ‘మిస్టర్ బచ్చన్ షో రీల్’ అనే పేరుతో గ్లింప్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ షో రీల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సింగిల్ డైలాగ్ లేకండా మేకర్స్ ఈ వీడియోను రిలీజ్ చేశారు.

డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ‘MR. బచ్చన్’. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ వీరి కాంబోలో మూవీ రాబోతుండటంతో.. అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. జగపతి బాబు విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ మెుత్తం పూర్తి చేసుకుని, తర్వాత పనుల్లో బిజీగా ఉంది.

MR Bachan

ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ  షో రీల్ ను రిలీజ్ చేసింది. దాదాపు నిమిషం నివిడి ఉన్న ఈ వీడియోలో సింగిల్ డైలాగ్ కూడా లేకపోవడం విశేషం. ఫుల్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో రవితేజ చివరి వరకూ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. వింటేజ్ లుక్ లో స్టైల్ గా స్మోకింగ్ చేస్తూ.. అభిమానులకు కిక్కిచ్చాడు. ఓ పవర్ ఫుల్ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఓ బడా పొలిటిషియన్ ఇంటికి రైడ్ కు వెళ్లాక.. అక్కడ ఏం జరిగింది అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించినట్లు సమాచారం.

ఇక ఈ మూవీలో ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకున్నారో అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఇలా సింగిల్ డైలాగ్ లేకుండా వీడియోను రిలీజ్ చేయడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ప్రజెంట్ ఈ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తూ.. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఇక ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించగా.. కెమెరామెన్ గా అయనంక బోస్ పనిచేశాడు. ప్రముఖ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. మరి ఈ షో రీల్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి