iDreamPost
android-app
ios-app

ఆ హీరో నో అన్న కథతో రవితేజని ఒప్పించాడా..?

  • Author ajaykrishna Published - 06:09 PM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 06:09 PM, Sun - 17 September 23
ఆ హీరో నో అన్న కథతో రవితేజని ఒప్పించాడా..?

టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్స్ కాంబినేషన్స్ లో మాస్ రాజా రవితేజ – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో ఒకటి. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఒకదాన్ని మించి ఒకటి హిట్ అవ్వడం విశేషం. మొదటగా డాన్ శీను సినిమాతో వీరి కాంబో సెట్ అయ్యింది. ఆ సినిమాతోనే డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఫస్ట్ సినిమా హిట్ అనిపించుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బలుపు సినిమా చేశారు. అది డాన్ శీనుకి మించి సూపర్ హిట్ అయ్యింది. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్లీ క్రాక్ సినిమా చేశారు. ఆ సినిమా.. అటు గోపీచంద్ కెరీర్ లో, ఇటు రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వసూళ్ల పరంగాను సినిమా హైయెస్ట్ రాబట్టింది.

కాగా.. ఇప్పుడు ఈ హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ నాలుగో సినిమాకు రెడీ అవుతోంది. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలియగానే.. బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. ఈ కాంబో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందులోనూ ఇప్పుడు ఇద్దరు సూపర్ హిట్స్ తో ఫామ్ లో ఉన్నారు. అదిగాక ఇప్పుడు రొట్టకొట్టుడు సినిమాలు, కథలను ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. సో.. క్రాక్ లాగే కొత్త స్టోరీతో రావాల్సి ఉంటుంది. అన్ని కొత్త కాన్సెప్ట్ లే.. కానీ, రోజులు మారిపోయాయి. ఆడియన్స్ కూడా ఏమాత్రం వేరే సినిమాలతో పోలికలు కనిపించినా పక్కన పెట్టేస్తున్నారు. సో.. పక్కాగా ఫ్రెష్ సబ్జెక్టుతో వస్తేనే హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కథ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైత్రి మూవీస్ వారు నిర్మించనున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. సో.. దీనికి కూడా తమన్ సంగీతం అందించనున్నాడు. అయితే.. రవితేజ కంటే ముందు బాలయ్యకి వీర సింహారెడ్డి కాకుండా వేరే కథ ఒకటి చెప్పాడట గోపీచంద్. ఆ కథను బాలయ్య రిజెక్ట్ చేయడంతో వీరసింహారెడ్డి తెరపైకి వచ్చింది. ఇప్పుడు బాలయ్య ఏ కథకైతే నో చెప్పాడో.. అదే కథతో రవితేజని ఒప్పించి గోపీచంద్ సినిమా చేస్తున్నాడని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరి రవితేజ – గోపీచంద్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş