iDreamPost

విరాట్ కోహ్లీని అలా ఒప్పుకోని వాళ్లు క్రికెట్ చూడటం మానేయండి: రవిశాస్త్రి

  • Author Soma Sekhar Published - 05:32 PM, Wed - 11 October 23
  • Author Soma Sekhar Published - 05:32 PM, Wed - 11 October 23
విరాట్ కోహ్లీని అలా ఒప్పుకోని వాళ్లు క్రికెట్ చూడటం మానేయండి: రవిశాస్త్రి

వరల్డ్ కప్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తో ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆసీస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 85 పరుగులు చేసి రాహుల్ తో కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో విరాట్ కోహ్లీపై వరల్డ్ వైడ్ గా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానాలు కోరింది ఐసీసీ. ఈ ప్రశ్నకు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు, ప్రస్తుత క్రికెటర్లు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు. అయితే రవిశాస్త్రి సైతం తన ఆన్సర్ చెప్పాడంతో పాటుగా విరాట్ విషయంలో అతడిని అలా ఒప్పుకోని వాళ్లు క్రికెట్ చూడ్డం మానేయండని సలహా కూడా ఇచ్చాడు.

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. ఆసీస్ పై ఆడిన ఇన్నింగ్స్ తర్వాత ఐసీసీ ఓ ప్రశ్నను వేసింది. విరాట్ కోహ్లీ ఎవరు? ఐసీసీ సంధించిన ఈ ప్రశ్నకు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు, ప్రస్తుత క్రికెటర్లు తమదైన రీతిలో సమాధానాలు చెప్పుకొచ్చారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ‘విరాట్ లెజెండ్ ఆఫ్ ది గేమ్’ అని ఆన్సర్ ఇవ్వగా.. కోహ్లీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్’అంటూ కితాబిచ్చాడు టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ. మిగతా వారిలో విరాట్ బెస్ట్ వన్డే ప్లేయర్ అని స్టీవ్ స్మిత్ అనగా.. అతడో ఫైటర్, గేమ్ ఛేంజర అంటూ లంక కెప్టెన్ దసున్ శనక సమాధానం ఇచ్చాడు.

కాగా.. చివర్లో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆన్సర్ ఇస్తూ..”ప్రస్తుత వరల్డ్ క్రికెట్ లో విరాట్ గ్రేటెస్ట్ ప్లేయర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఎవరైనా కోహ్లీని గ్రేటెస్ట్ అని ఒప్పుకోకపోతే.. అలాంటి వాళ్లు క్రికెట్ చూడటం మానేయండి. ఇది మీలాంటి వారికోసం కాదు” అని కాస్త గట్టిగానే చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి. మరి టీమిండియా మాజీ హెడ్ కోచ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి