iDreamPost

మిమ్మల్ని లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్‌ చేయండి..

  • Published Apr 27, 2024 | 12:44 PMUpdated Apr 27, 2024 | 12:44 PM

ACB Toll Free Number: ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని కావాలన్న లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి లంచగొండి అధికారులను ఏం చేయాలేమా అంటే.. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయమంటున్నారు. ఆ వివరాలు..

ACB Toll Free Number: ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని కావాలన్న లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి లంచగొండి అధికారులను ఏం చేయాలేమా అంటే.. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయమంటున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 27, 2024 | 12:44 PMUpdated Apr 27, 2024 | 12:44 PM
మిమ్మల్ని లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్‌ చేయండి..

లంచం.. మన సమాజాన్ని పట్టి పీడుస్తున్న వ్యసనాల్లో ఇది ప్రధానమైంది. ఓ రకంగా చెప్పాలంటే.. లంచం అనేది సమాజానికి సోకిన క్యాన్సర్‌ వంటిది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంత చిన్న పని జరగాలన్న.. చిన్న పత్రం రావాలన్నా.. లంచం ఇవ్వాల్సిందే. లేదంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కావు. అయితే అందరూ ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటారా అంటే కాదు. కానీ నూటికి 90 శాతం మంది మాత్రం లంచం తీసుకోకుండా ఏ పని చేయరు. వారు అడిగినంత చెల్లిస్తే.. నిమిషాల వ్యవధిలో పనులు పూర్తవుతాయి. ఇక ఇటీవల కాలంలో లంచం తీసుకుంటు పట్టుబడ్డ ప్రభుత్వ అధికారుల సంఖ్య పెరుగుతోంది.

తాజాగా.. హైదరాబాద్‌లో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చేందుకు ఏకంగా రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ). తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా డీఈఈ యాత పవన్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అతడు బాధితుడి వద్ద తీసుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకుని.. ఆ తర్వాత పవన్‌ కుమార్‌ను రిమాండుకు తరలించారు.

రామంతాపూర్‌కు చెందిన బిల్డర్‌ గోపగాని రమణమూర్తి ఉప్పల్‌ భగాయత్‌లోని శాంతినగర్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నాడు. ఆ భవనానికి ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోగా.. పవన్‌కుమార్‌ రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తాను అడిగిన మొత్తం ఇస్తేనే.. ఎన్‌ఓసీ మంజూరు చేస్తానని స్పష్టం చేశాడు. లంచంగా వందలు, వేలు కాకుండా ఏకంగా లక్షల్లో డిమాండ్‌ చేయడంతో ఏం చేయాలో బాధితుడికి అర్థం కాలేదు. తనను లంచం పేరుతో ఇబ్బంది పెడుతున్న పవన్‌ కుమార్‌ గురించి ఏసీబీకి సమాచారం ఇచ్చాడు.

వారి సూచన ప్రకారం.. రమణమూర్తి శుక్రవారం బుద్ధభవన్‌లోని కార్యాలయంలో పవన్‌కు రూ.4 లక్షలు ఇస్తుండగా అధికారులు డీఈఈని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. అతడు బాధితుడి వద్ద నుంచి తీసుకున్న నగదు స్వాధీనం చేసుకొని.. నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు లంచగొండి అధికారికి రిమాండ్ విధించింది. ఏ ప్రభుత్వోద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాక లంచం అండగం ఎంత తప్పో.. ఇవ్వడం కూడా నేరమే అని హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి