iDreamPost

టీచింగ్ చేయాల్సిన పనిలేదు.. నవోదయ విద్యాలయాల్లో 1,337పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు

మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. నవోదయ విద్యాలయాల్లో 1337 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు టీచింగ్ అవసరం లేదు.

మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. నవోదయ విద్యాలయాల్లో 1337 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు టీచింగ్ అవసరం లేదు.

టీచింగ్ చేయాల్సిన పనిలేదు.. నవోదయ విద్యాలయాల్లో 1,337పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు

ఈ సారి ఎలాగైనా ఏదోఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? గవర్నమెంట్ జాబ్ కొట్టేందుకు ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. నవోదయ విద్యాలయాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మళ్లీ రాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షలకు పైగా జీతం అందుకోవచ్చు. నవోదయ విద్యాలయాల్లో టీచింగ్ తో అవసరం లేని నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ అర్హతలు ఉన్నట్లైతే మీరే అదృష్టవంతులు.

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రకటించిన పోస్టుల్లో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

నాన్-టీచింగ్ పోస్టుల సంఖ్య:

  • 1377.

స్టాఫ్ నర్స్ (ఫీమేల్):

  • 121

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్:

  • 05

ఆడిట్ అసిస్టెంట్:

  • 12

జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్:

  • 04

లీగల్ అసిస్టెంట్:

  • 01

స్టెనోగ్రాఫర్:

  • 23

కంప్యూటర్ ఆపరేటర్:

  • 02

కేటరింగ్ సూపర్‌వైజర్:

  • 78

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెడ్‌క్వార్టర్స్/ప్రాంతీయ కార్యాలయాలు):

  • 21

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎన్‌వీ):

  • 360

ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్:

  • 128

ల్యాబ్ అటెండెంట్:

  • 161

మెస్ హెల్పర్:

  • 442

మల్టీటాస్కింగ్ స్టాఫ్:

  • 19

అర్హత:

  • పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను బట్టి నెలకు రూ. 18000 నుంచి 1,42,400వరకు అందుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు), రూ.1000 (ఇతర పోస్టులకు).. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 22-03-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 30-04-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి