iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ కి గాయం.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ క్యాన్సిల్!

  • Published Sep 25, 2023 | 8:43 AM Updated Updated Sep 25, 2023 | 9:18 AM
  • Published Sep 25, 2023 | 8:43 AMUpdated Sep 25, 2023 | 9:18 AM
రామ్ చరణ్ కి గాయం.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ క్యాన్సిల్!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి కొద్దిమంది మాత్రమే స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఒకరు. నటించింది కొన్ని చిత్రాలే అయినా బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకువెళ్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్  వాయిదా పడింది. వివరాల్లోకి వెళితే..

దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియరా అద్వాని జంటగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి పలు కారణాలతో షూటింగ్ క్యాన్సల్ అవుతూ వస్తుంది. తాజాగా మరోసారి గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ వాయిదా పడ్డట్లు సమాచారం. దీనికి కారణంగా రెండు రోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి గాయం అయ్యింది. దీంతో డాక్టర్లు ఆయనను పదిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచింనట్లు సమాచారం. దీంతో ఆదివారం నుంచి మొదలు కావాల్సిన గేమ్ చేంజర్ షెడ్యూల్ వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Ram charan injured doing fight sequence

 రామ్ చరణ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 6 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. కాగా, కేజీఎఫ్ ఫేమ్ అన్బు అరివు సారథ్యంలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు చిత్ర యూనిట్. ఇటీవల ఈ మూవీ నుంచి ఓ పాట లీక్ కావడంతో లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మూవీలో శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet