iDreamPost

RC16 కోసం పాన్ ఇండియా స్టార్స్.. బుచ్చిబాబు పెద్ద ప్లానే..!

  • Author singhj Published - 09:49 PM, Thu - 24 August 23
  • Author singhj Published - 09:49 PM, Thu - 24 August 23
RC16 కోసం పాన్ ఇండియా స్టార్స్.. బుచ్చిబాబు పెద్ద ప్లానే..!

రెండు సినిమాలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ కెరీర్ నెక్స్ట్ లెవల్​కు వెళ్లిపోయింది. ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు చెర్రీ ఇమేజ్​ను ఎంతగానో పెంచాయి. డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు, డైలాగులు భలేగా చెబుతాడనే పేరున్న చరణ్.. ‘రంగస్థలం’తో మెచ్యూర్డ్ యాక్టర్​గా పేరు తెచ్చుకున్నారు. ఆయనలోని అసలైన నటనా పటిమను ఈ సినిమాతో ప్రేక్షక లోకానికి పరిచయం చేశారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అద్భుతంగా నటించే సత్తా తనకు ఉందని ఆయన నిరూపించుకున్నారు. ఇక, ‘ఆర్ఆర్ఆర్’తో తనలోని మరో కోణాన్ని ఆడియెన్స్​కు పరిచయం చేశారు చరణ్. సీతారామరాజు క్యారెక్టర్​లో చక్కగా ఒదిగిపోయి భావోద్వేగాలను బాగా పలికించారు.

‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ సక్సెస్ కావడం, ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్​ గ్లోబల్ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మెగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఒక చిత్రానికి చెర్రీ ఓకే చెప్పారు. ఈ మూవీని ప్రస్తుతం ‘ఆర్​సీ16’గా పిలుస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ‘ఆర్​సీ16’ కథా చర్చలు, రైటింగ్ పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది.

చరణ్​తో చేసే చిత్రం కోసం పాన్ ఇండియా స్టార్స్​ను రంగంలోకి దింపుతున్నారట దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ నటుడు, క్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారని సమాచారం. ఆయనతో పాటు ప్రముఖ నటులు జేడీ చక్రవర్తి, సాయిచంద్, సంపత్​రాజ్​లనూ రంగంలోకి దించుతున్నారట బుచ్చిబాబు. సినిమాలో మరో కీలక పాత్ర కోసం మున్నాభాయ్​ను కూడా తీసుకొస్తున్నారట. మున్నాభాయ్ అంటే మరెవరో కాదు.. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్​తో పాపులరైన దివ్యేందు శర్మే. ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చనున్నారని తెలిసింది. ఈ న్యూస్ విన్న చరణ్​ ఫ్యాన్స్.. భారీ స్టార్ క్యాస్ట్​తో బుచ్చిబాబు పెద్దగానే ప్లాన్ చేశాడని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి