iDreamPost

మీకు ఆ Bankలో ఖాతా ఉందా.. అయితే వెంటనే వెళ్లి ఈ పని చేయండి.. లేకుంటే ఖాతా క్లోజ్

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. మీకు ఆ బ్యాంక్ లో ఖాతా ఉన్నట్లైతే వెంటనే బ్యాంక్ కు వెళ్లి ఈ పని చేయండి. లేదంటే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. మీకు ఆ బ్యాంక్ లో ఖాతా ఉన్నట్లైతే వెంటనే బ్యాంక్ కు వెళ్లి ఈ పని చేయండి. లేదంటే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది.

మీకు ఆ Bankలో ఖాతా ఉందా.. అయితే వెంటనే వెళ్లి ఈ పని చేయండి.. లేకుంటే ఖాతా క్లోజ్

ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. వ్యాపారం ప్రారంభించేందుకు బ్యాంక్ లో లోన్ తీసుకునేటపుడు లేదా సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలన్నా బ్యాంక్ ఖా తా ఉండాల్సిందే. ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ను ప్రతి ఒక్కరు కలిగి ఉంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. కాగా అవసరం తీరాక ఒక ఖాతాను మాత్రమే వాడుకుంటూ మిగతా వాటిని విస్మరిస్తున్నారు. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయకుండా, ట్రాన్సాక్షన్స్ నిర్వహించకుండా వదిలేస్తున్నారు. ఇలాంటి ఖాతాలు కలిగిన వారికి బిగ్ అలర్ట్. ఆ బ్యాంక్ లో ఖాతా కలవారు వెంటనే బ్యాంక్ కు వెళ్లి ఈ పని చేయండి. లేదంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది.

అకౌంట్ హోల్డర్లు బ్యాంక్ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయకపోతే ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అదే సమయంలో అసలు ట్రాన్సాక్షన్స్ చేయకపోతే ఖాతా ఇనాక్టివ్ గా మారుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. 3 సంవత్సరాలుగా లావాదేవీలు జరగని ఖాతాలను క్లోజ్ చేస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ట్రాన్సాక్షన్స్ జరపకుండా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. మరి మీ ఖాతా ఆక్టివ్ గా ఉండాలంటే బ్యాంక్ కు వెళ్లి కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాతాలకు కేవైసీ చేసుకునేందుకు జూన్‌ 1 వరకు మాత్రమే గడువునిచ్చింది బ్యాంక్.

ఖాతాలు దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు, మోసాలను నివారించేందుకు బ్యాంక్ ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. 3 సంవత్సరాల పాటు నిష్క్రియంగా ఉన్న అన్ని ఖాతాలు మూసివేస్తోంది పంజాబ్ నేషనల్ బ్యాంకు. అయితే ఖాతాను కేవైసీ చేసుకునేందుకు గుర్తింపు రుజువు తప్పనిసరి. పాన్‌కార్డు, ఆధార్‌, పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలను బ్యాంకులో అందించి కేవైసీని చేసుకోవచ్చు. అకౌంట్ ను మళ్లీ ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఒక వేళ మీకు ఆ ఖాతతో భవిష్యత్తులో ఎలాంటి అవసరం లేదని భావిస్తే వదిలేయొచ్చు. అయితే కొన్ని ఖాతాలకు మాత్రం బ్యాంక్ వెసులుబాటునిచ్చింది. డీమ్యాట్ ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాల కోసం తెరిచిన అకౌంట్లను క్లోజ్ చేయదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి