iDreamPost

ప్రముఖ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్.. ఆందోళనలో కస్టమర్లు

  • Published Jun 20, 2024 | 10:21 PMUpdated Jun 20, 2024 | 10:21 PM

RBI cancelled Bank Licence: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా పని చేసే బ్యాంకులకు భారీ జరిమానా విధిస్తుంటుంది. రీసెంట్ గా ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులకు భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని బ్యాంకుల లైసెన్సులను కూడా రద్దు చేస్తుంటుంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్సుని క్యాన్సిల్ చేసింది ఆర్బీఐ.

ఆర్బీఐ అప్పుడప్పుడు కొన్ని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తూ ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు ప్రవర్తిస్తే వాటి లైసెన్సులను క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భారీ పెనాల్టీ విదిస్తుంది. రీసెంట్ గా ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎస్ బ్యాంకుకి 91 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకుకి కోటి రూపాయల జరిమానా విధించింది. తాజాగా మరో బ్యాంకుపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. ఏకంగా ఆ బ్యాంకు లైసెన్స్ ని రద్దుకే చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.   

మహారాష్ట్రలోని సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. బ్యాంకులో తగిన మూలధనం లేకపోవడం, బ్యాంకు సంపాదన అవకాశాలు అస్సలు లేని కారణంగా ఆర్బీఐ బ్యాంకు లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది.  బ్యాంకుని క్లోజ్ చేయడానికి.. అలానే లిక్విడేటర్ ను నియమించడానికి ఆదేశాలు జారీ చేయాలని.. మహారాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ని ఆర్బీఐ కోరింది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. మహారాష్ట్ర సిటీ కోపరేటివ్ బ్యాంక్ ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ సర్వీస్ ని అందించిందని తెలుస్తోంది. జూన్ 19 నుంచే సేవలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఖాతాదారులకు తెలియనిది ఏంటంటే.. ఇలాంటివి జరిగినప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయల వరకూ బీమా రక్షణ ఉంటుంది. ఎవరైతే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తారో వారందరికీ ఈ పాలసీ వర్తిస్తుంది. బ్యాంకులు దివాళా తీసినా, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా.. అటువంటి సమయంలో డిపాజిటర్లు నష్టపోకుండా 5 లక్షల వరకూ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. బ్యాంకు డేటా ప్రకారం.. డిపాజిటర్లలో 87 శాతం మంది డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి పూర్తి మొత్తం డిపాజిట్లను పొందడానికి అర్హులని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.       

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి