Dharani
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఒకటి కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి తమ బ్యాంకులో ఉన్న కొందరి సేవింగ్స్ అకౌంట్లని క్లోజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఒకటి కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి తమ బ్యాంకులో ఉన్న కొందరి సేవింగ్స్ అకౌంట్లని క్లోజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
తమ కస్టమర్లకు ఓ ప్రభుత్వ బ్యాంకు భారీ షాకిచ్చిందుకు రెడీ అవుతోంది. జూలై 1 నుంచి తన బ్యాంకులో ఉన్న కొన్ని సేవింగ్స్ అకౌంట్ ఖాతాలను రద్దు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు కస్టమర్లకు హెచ్చరికలు కూడా జారీ చేయడమే కాక.. నోటీసులు కూడా పంపింది. ఇంతకు ఏ బ్యాంకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. ఎందుకంటే.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు.. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండి.. కొన్ని సంవత్సరాలుగా దాన్ని ఉపయోగించనట్లయితే.. అలాంటి వాటిని క్లోజ్ చేయాలని భావిస్తోంది. జులై 1 తర్వాత వీటిని రద్దు చేస్తామని పీఎన్‌బీ స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు తన అధికారిక బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
గతంలో ఇలా నిరుపయోగంగా ఉన్న అకౌంట్లను మూసివేసేందుకు మే 31 ఆఖరి తేదీగా ప్రకటించింది పీఎన్‌బీ. ఆ తర్వాత జూన్ 1 నుంచి.. మూడేళ్లుగా నిరూపయోగంగా ఉన్న ఖాతాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కస్టమర్లకు అసౌకర్యం లేకుండా ఉండేదుకు గాను ఈ సమయాన్ని మరికొంత పొడిగిస్తున్నట్లు వెల్లడించి.. మరో నెల రోజులు సమయం ఇచ్చింది. ఇక ఇప్పుడు జూలై 1 నుంచి.. ఇలా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను రద్దు చేస్తామని ప్రకటించింది. కస్టమర్లు దీనిపై దృష్టి సారించాలని పీఎన్‌బీ తన వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
ఈ క్రమంలో మీకు గనక పీఎన్‌బీలో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఏందుకంటే.. జూన్ 30 దాటాక.. అనగా జూలై 1 తర్వాత వాడుకలో లేని అంటే నిరుపయోగ (ఇన్- ఆపరేటివ్) ఖాతాల్ని మూసివేయనుంది బ్యాంకు. గత 3 సంవత్సరాలుగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరగని ఖాతాలను.. అలానే ఈ 3 సంవత్సరాల్లో అకౌంట్ బ్యాలెన్స్ సున్నాగా ఉన్న అకౌంట్లను కూడా క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. అంతేకాక అలాంటి కస్టమర్లకు ఇప్పటికే దీని గురించి తెలియసజేస్తే.. నోటీసులు కూడా పంపింది.
నిరుపయోగంగా ఉన్న అకౌంట్లను తిరిగి రీయాక్టివేట్ చేయించుకునేందుకు కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు కొద్ది రోజుల కిందటే తెలియజేసింది. పలుమార్లు గడువు పొడిగించి ఇప్పుడు జులై 1 కి చేర్చింది. తమ బ్యాంకులో కస్టమర్ల పేరున ఉన్న ఉపయోగించని ఇలాంటి ఖాతాల్ని.. మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకే ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు బ్యాంక్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం .. ఖాతా లెక్కింపు 2024, ఏప్రిల్ 30 ని బట్టి జరుగుతుంది.
బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. అకౌంట్ ఇనాక్టివ్ అయి ఉండి.. మీరు తిరిగి దాన్ని వాడాలని భావిస్తే.. అకౌంట్‌ని యాక్టీవేట్ చేయాలనుకుంటే మీకు దగ్గరలోని బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ ఫారం నింపాలి. దాంతో పాటు అవసరమైన, బ్యాంక్ అడిగిన డాక్యుమెంట్స్ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇవన్ని ఇస్తే.. బ్యాంక్ మీ అకౌంట్‌ని తిరిగి యాక్టివేట్ చేస్తుంది.