iDreamPost

రీ రిలీజ్‌కు సిద్దమౌతున్న శంకర్ ప్రేమ కథా చిత్రం ప్రేమికుడు

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలను మళ్లీ ప్రేక్షకులకు అందించేందుకు రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రీ రిలీజ్ కాబోతుంది.

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలను మళ్లీ ప్రేక్షకులకు అందించేందుకు రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రీ రిలీజ్ కాబోతుంది.

రీ రిలీజ్‌కు సిద్దమౌతున్న శంకర్ ప్రేమ కథా చిత్రం ప్రేమికుడు

ప్రస్తుతం సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్లలో మరోసారి అలరిస్తున్నాయి. టీవీల్లో వాచ్ చేసిన కూడా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం వస్తున్నారు సినిమా లవర్స్. ముఖ్యంగా తమకు ఊహా తెలియనప్పడు విడుదలైన మూవీస్.. మళ్లీ రీ రిలీజ్ అవుతుంటే.. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ.. అప్పట్లో ఆదరణ పొందని సినిమాలు సైతం నేడు థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన ఓయ్ మూవీ. అప్పట్లో ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఇటీవల రీ రిలీజ్ చేస్తే విపరీతంగా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది.

ప్రముఖ డైరెక్టర్ శంకర్ చిత్రాల్లో తొలి లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా కాదలన్, తెలుగులో ప్రేమికుడు పేరుతో రిలీజ్ అయ్యింది. ప్రభుదేవా, నగ్మా, బాల సుబ్రమణ్యం, గిరీష్ కర్నాడ్, వడివేలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. 1994 సెప్టెంబర్ 17న విడుదలైంది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి.. ఓ ధనవంతురాలి కూతుర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించిన పిక్చర్ ఇది. రెహమాన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికి చార్ట్ బస్టర్సే. ఓ చెలి నా ప్రియ సఖియా చేయి జారెను నా మనస్సే అంటూ ఇప్పటికి లవర్స్ హమ్ చేస్తూనే ఉంటారు. మంచు కొండల్లో తెరకెక్కించిన ఈ పాట ఎంతో సుందరంగా తెరకెక్కించాడు దర్శకుడు.

ఇక అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే సాంగ్ మరో లవ్ ట్రాక్. ఇక ముక్కాల ముక్కాబులా సాంగ్ అప్పట్లో ట్రెండ్ సెట్టార్. ఇప్పటికి ఈ పాట వస్తుంటే.. ఒళ్లు ఊగిపోవాల్సిందే. ఊర్వశి ఊర్వశి సాంగ్ మరో కలికితురాయి. కెటి కుంజుమన్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. మే 1న ఈ ప్రేమ కథా చిత్రం విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఏకంగా 300 స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తుండటం విశేషం. మరీ ఫ్యాన్స్ బీ రెడీ. అప్పట్లో థియేటర్లలో మిస్ అయ్యాం అనుకున్న వాళ్లంతా చూసి ఆనందించవచ్చు. ఇక థియేటరల్లో పాట వస్తే బాడీ షేక్ కాకుండా చూసుకోవాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి