iDreamPost

విజయవాడ TDP లో కోల్డ్ వార్..హీటెక్కిన రాజకీయం!

ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీలోని నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా బెజవాడ కేంద్రంగా ఇద్దరి నేతల మధ్య రాజకీయ రగడ జరుగుతున్నట్లు సమాచారం.

ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీలోని నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా బెజవాడ కేంద్రంగా ఇద్దరి నేతల మధ్య రాజకీయ రగడ జరుగుతున్నట్లు సమాచారం.

విజయవాడ TDP లో కోల్డ్ వార్..హీటెక్కిన రాజకీయం!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్ది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో వైసీపీ అధిష్టానం నిమగ్నమైంది. ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీ, జనసేనలకు చెమటలు పడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇది ఇలా ఉంటే.. టీడీపీ పార్టీల్లో వర్గ పోరు కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో టీడీపీలో ఉన్న వర్గ పోరు కనిపిస్తున్నాయి. విజయవాడ కేంద్రం ఇద్దరు టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజకీయ రగడ గట్టిగానే నడుస్తోంది. ఇప్పటికే పల్నాడు, గుంటూరు, నంద్యాల, అనకాపల్లి, నెల్లురూ వంటి జిల్లాలోని టీడీపీ నేతల మధ్య కోల్డ్ ఓ వార్ జరుగుతుంది స్థానికులు తెలిపారు. అంతేకాక  సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోస్టుల దాడులు కూడా చేసుకుంటున్నారు. దీంతో  తెలుగు తమ్ముళ్ల రచ్చ కాస్తా రాజకీయ రచ్చగా మారింది. తాజాగా విజయవాడ సెంట్రల్ కేంద్రగా టీడీపీలో రాజకీయ వార్ మొదలైంది.

స్థానిక సమాచారం ప్రకారం.. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, బోండా  వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వీరి అనుచరుల మధ్య పొలిటికల్  ఆధిపత్య పోరు జరుగుతోందని టాక్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇరు వర్గాల నేతల అనుచరులు పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు చేసుకుంటున్నారు.  వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అలానే సర్వేల్లో ఉమాకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ పోస్టులు పెట్టారు.  అయితే ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారంటూ రాధా వర్గం సంచలన ఆరోపణలు చేసింది.

ఈక్రమంలోనే తాజాగా బోండా ఉమా అనుచరులకు టార్గెట్ గా రీకౌంటర్ పోస్టులు పెట్టింది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగా అనుచరుడిగా ఎదిగిన ఉమా.. ఇప్పుడు ఆయన కుమారుడిపై ఇలాంటి పోస్టులు పెట్టించడం ఏంటని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఇక ఈ పోస్టులను రాధా వర్గమే ఇలా చేసినట్లు బోండా ఉమా వర్గం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమా, రాధా వర్గాల మధ్య కోల్డ్ వార్ తో బెజవాడ రాజకీయం రసవత్తంగా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి.. టీడీపీ లో కోల్డ్ వార్ జరుగుతోంది అంటూ వస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి