iDreamPost

OTT లో బుర్ర పాడు చేసే బో*ల్డ్ వెబ్ సిరీస్.. ఆ ట్విస్ట్ ఊహించి ఉండరు.

  • Published Jun 26, 2024 | 4:56 PMUpdated Jun 26, 2024 | 4:56 PM

Best Romantic Telugu Series In OTT:రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ కాకుండా ఇంకా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి... చాలానే ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఓ డిఫ్ఫరెంట్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమానే. మరి ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Romantic Telugu Series In OTT:రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ కాకుండా ఇంకా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి... చాలానే ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఓ డిఫ్ఫరెంట్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమానే. మరి ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 26, 2024 | 4:56 PMUpdated Jun 26, 2024 | 4:56 PM
OTT లో బుర్ర పాడు చేసే బో*ల్డ్ వెబ్ సిరీస్..  ఆ ట్విస్ట్ ఊహించి ఉండరు.

రెగ్యులర్ గా చూసే నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ , అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్ ఏ కాకుండా ఇంకా చాలానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో కూడా ఎన్నో మంచి మంచి సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చే సినిమాలనే ప్రేక్షకులు అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఇలాంటి కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఉన్నాయని కూడా తెలియని వారు.. కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను, సిరీస్ లను మిస్ చేయడం సహజమే. అటువంటి వారికోసమే ఈ సిరీస్ సజ్జెషన్. మరి ఈ సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

అసలు ఈ సిరీస్ ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సిరీస్ కథేంటో చూసేద్దాం.. అమలాపురంలోని వీరేంద్ర రాజు అలియాస్.. రాజు గారు కోడి పులావ్ అనే హోటల్ బిర్యానీకి చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో రాజు గారి కోడి పులావ్ తినేందుకు జనం ఎగబడుతూ ఉంటారు. దీనితో సోషల్ మీడియా , మీడియా ద్వారా కూడా ఆ హోటల్ చాలా ఫేమస్ అవుతుంది. దీనితో హోటల్ ఓనర్ రాజు చాలా సంతోషిస్తాడు. జీవితంలో అన్నీ బాగున్నా సరే.. రాజుగారికి కూతురు, భార్య వలన మాత్రం అసంతృప్తి ఉంటుంది . ఈ క్రమంలో అనుకోకుండా రాజు గారికి యాక్సిడెంట్ అయ్యి.. వీల్ చైర్ కు పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

LSD

కట్ చేస్తే ఇక్కడ ఇంకో సీన్ చూపిస్తారు. బద్రి-ఆకాంక్ష అనే భార్య భర్తలు తమ ఫ్రెండ్స్ తో ఓ అడివి ప్రాంతానికి ట్రిప్ కు వెళ్తారు. వారు ఆ ట్రిప్ కు వెళ్లే ముందే.. తమ కూతురు ఫారెస్ట్ కు వెళ్లోద్దని అక్కడ పెద్ద మాన్ స్టర్ .. డాడీ, మమ్మీని తినేస్తున్నట్లు కల వచ్చిందని చెప్తుంది. అయినా సరే పట్టించుకోకుండా వారు ఆ ఫారెస్ట్ కు వెళ్తారు. దారిలో వారితో పాటు మరో రెండు జంటలు కూడా జాయిన్ అవుతారు.. ఈ ముగ్గురు జంటలు కలిసి సంతోషంగా ఫారెస్ట్ కు వెళ్తున్న సమయంలో.. కొంత దూరం వెళ్ళాకా కారు చెడిపోతుంది. దానితో ఫారెస్ట్ కాటేజస్ వరకు నడవాలని అనుకుంటారు. ఆ వెళ్లే దారిలో ఎవరికి అర్ధం కానీ విధంగా వారిలో ఒక ఆమె చనిపోతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు మిస్ అవుతూ ఉంటారు. అసలు ఆమె ఎలా చనిపోతుంది ! ఆ తర్వాత ఒక్కొక్కరు ఎందుకు మిస్ అయ్యారు ! ఈ మూడు జంటలకు.. రాజు గారి కోడి పులావ్ కు.. రాజు గారికి ఏంటి సంబంధం? అసలు ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఇంతకీ ఈ సిరీస్ పేరు ఏంటంటే LSD (లవ్ సె*క్స్ డెత్). ఈ సిరీస్ ఎవరు ఊహించని ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో ఉంది. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ ప్రతి ఎపిసోడ్ లోను ప్రేక్షకులకు కలుగుతుంది. కొన్ని ఎపిసోడ్స్ కాస్త కంఫ్యూజింగ్ గా అనిపించినా కూడా క్లైమాక్స్ కు వచ్చేసరికి అందరికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఈ సిరీస్ ను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి