iDreamPost

OTTలో నివేదా పేతురాజ్ థ్రిల్లర్ సిరీస్.. బ్లాక్ మనీ- హవాలా నేపథ్యంలో!

OTT Suggestions: ఓటీటీల్లో ఉన్న వెబ్ సిరీస్లలో ఏది చూడాలో తెలియడం లేదా? వారం వారం కొత్త వెబ్ సిరీస్ వెతుక్కోవాలి అంటే కష్టంగా ఉందా? అయితే మేము ఇచ్చే ఈ ఓటీటీ సజీషన్స్ ఫాలో అయిపోండి.

OTT Suggestions: ఓటీటీల్లో ఉన్న వెబ్ సిరీస్లలో ఏది చూడాలో తెలియడం లేదా? వారం వారం కొత్త వెబ్ సిరీస్ వెతుక్కోవాలి అంటే కష్టంగా ఉందా? అయితే మేము ఇచ్చే ఈ ఓటీటీ సజీషన్స్ ఫాలో అయిపోండి.

OTTలో నివేదా పేతురాజ్ థ్రిల్లర్ సిరీస్.. బ్లాక్ మనీ- హవాలా నేపథ్యంలో!

ఓటీటీలో ఎన్నో వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వాటిలో అన్నీ చూడాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. కుదిరినప్పుడు ఏదో ఒక వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటారు. కానీ, ఆ చూసినంతసేపు అయినా ఒక మంచి వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటారు. స్టార్ట్ చేసిన తర్వాత అది మంచి వెబ్ సిరీస్ కాకపోయినా.. అంత థ్రిల్లింగ్ గా అనిపించకపోయినా చాలా డిజప్పాయింట్ అవుతారు. అందుకే అలా మీరు డిజప్పాయింట్ అవ్వకూడదు అని మేమే మీకు మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్లు సజీషన్స్ రూపంలో ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ తీసుకుని వచ్చేశాం. ఇందులో హవాలా, బ్లాక్ మనీ మాత్రమే కాకుండా.. కాస్త వైలెన్స్ కూడా ఉంటుంది. పైగా ఇందులో నివేదా పేతురాజు కీలక పాత్ర కూడా పోషించింది.

ఇప్పుడు చెప్పుకునే వెబ్ సిరీస్ పేరు “కాలా”. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హాట్ స్టార్ స్పెషల్ గా వచ్చిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు 6 నెలలు దాటిపోయింది. ఈ సిరీస్ మొత్తం 7 భాషల్ల అందుబాటులో ఉంది. అలాగే ఐఎండీబీలో కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇదంతా వైలెన్స్, హవాలా డబ్బు, బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ వంటి క్రిమినల్ యాక్టివిటీస్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటాయి. ఈ సీజన్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 28 నిమిషాల నుంచి 52 నిమిషాల వరకు ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ లో యాక్షన్, డ్రామా మాత్రమే కాకుండా ఎమోషన్ కూడా ఉంటుంది. అలాగే ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది ఈ సిరీస్లో.

కోల్ కతా ఐబీ ఆఫీసర్ రిత్విక్(అవినాశ్ తివారి) టీమ్ లో వర్క్ చేసే తారా(నివేదా పేతురాజ్) మధ్య లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ కాలా వెబ్ సిరీస్ లో మెయిన్ మోటో బ్లాక్ మనీని కట్టడి చేయడం. 2018లో జరిగిన కథలా దీనిని చూపించారు. ఇందులో బుజినెస్ టైకూన్ నామన్ ఆర్య(షబ్బీర్)ని టార్గెట్ చేస్తుంది కోల్ కతా ఐబీ టీమ్. నామన్ ఆర్య స్క్రాప్ రీసైక్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతడు ఆ స్క్రాప్ బిజినెస్ ముసుగులో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం చేస్తుంటాడు. అలాగే రివర్స్ హవాలా కూడా చేస్తాడు. అతడిని టార్గెట్ చేసిన ఐబీ టీమ్ కి చుక్కలు చూపిస్తాడు. అలాగే రిత్విక్- నామన్ ఆర్య మధ్య జరిగే డ్రామా ఆసక్తిగా ఉంటుంది. రిత్విక్ ముఖర్జీ అడుగడుగునా నామన్ ఆర్యని ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, నామన్ మాత్రం రిత్విక్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తన బ్లాక్ బిజినెస్ ని కొనసాగిస్తూ ఉంటాడు.

ఈ కాలా సిరీస్ లో ఐబీ ఆఫీసర్ గా చేసిన నివేదా పేతురాజ్ యాక్టింగ్ లోనే కాదు.. యాక్షన్ లో కూడా ఇరగదీసింది. అందరూ తమ పాత్రకు న్యాయం చేశారు. ఇన్టెన్స్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. మొత్తానికి ఈ 8 ఎపిసోడ్స్ ఆడియన్స్ లో ఆసక్తిని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఎవరినైతే పట్టుకోవాలి అని తన కెరీర్ ని కూడా పణంగా పెడతాడు.. అతడు పెట్టిన ఉచ్చు హీరో చిక్కుకుంటాడు. ఆఖరికి సొంత టీమ్ కూడా హీరో ఒక దొంగ అని నమ్మేస్తారు. విలన్ సంగతి పక్కన పెట్టేసి రిత్విక్ ని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 14 వేల కోట్ల నల్ల డబ్బు రవాణా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి నల్ల ధనాన్ని పట్టుకున్నారా? నామన్ ఆర్యన్ ని రిత్విక్ పట్టుకున్నాడా? అసలు రిత్విక్ నామన్ ఆర్యన్ ట్రాప్ లో ఎలా పడ్డాడు? ఈ బ్లాక్ మనీతో ఎలాంటి ఇల్లీగల్ పనులు చేశారు? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలి అంటే మీరు డిస్నీప్లస్ హాట్ స్టార్ లో కాలా వెబ్ సిరీస్ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి