iDreamPost

OTT Movie Suggestion: భర్తకు చెప్పకుండా భార్య ఆ పని! తీరా బిడ్డ పుట్టకా ! OTT లో డిఫరెంట్ మూవీ

  • Published Jun 04, 2024 | 1:02 PMUpdated Jun 04, 2024 | 1:02 PM

ఇప్పుడు చాలా మంది ఓటీటీ లకు బాగా అలవాటు పడిపోయారు కానీ.. ప్రస్తుతం అయితే అంతా చెప్పుకోదగిన ఓటీటీ అప్ డేట్స్ ఏమి లేవు. కాబట్టి ఇప్పటివరకు ఓటీటీ లో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ఇప్పుడు చాలా మంది ఓటీటీ లకు బాగా అలవాటు పడిపోయారు కానీ.. ప్రస్తుతం అయితే అంతా చెప్పుకోదగిన ఓటీటీ అప్ డేట్స్ ఏమి లేవు. కాబట్టి ఇప్పటివరకు ఓటీటీ లో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

  • Published Jun 04, 2024 | 1:02 PMUpdated Jun 04, 2024 | 1:02 PM
OTT Movie Suggestion: భర్తకు  చెప్పకుండా భార్య ఆ పని! తీరా బిడ్డ పుట్టకా ! OTT లో డిఫరెంట్ మూవీ

ఇప్పుడు చాలా మంది ఓటీటీ లు అలవాటు పడిపోయారు. దీనితో ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు, సిరీస్ లు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఓటీటీ లో మరి అంత చెప్పుకోదగిన సినిమాలు ఏమి రాలేదనే చెప్పి తీరాలి. ఇక ఈ వారం అప్ డేట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనితో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన వారికి నిరాశ మిగులుతుంది. కానీ ఇంకా ఓటీటీ లో చూడాల్సిన కంటెంట్ చాలానే ఉంది. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్స్. కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను ఓటీటీ లో మిస్ అయినా వారు ఉంటె వెంటనే చూసేయండి. మరి ఆ సినిమా ఏంటి ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే సంఘటనలను ఆధారంగా తీసుకుని రూపొందించినదే. రోటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్లకు ఈ సినిమా కాన్సెప్ట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అసలు ఈ సినిమా కథేంటంటే.. సృష్టిలో ఏ జీవికి అయినా సహజ ప్రక్రియలో గర్భం దాల్చే గుణం ఉంటుంది. కానీ దానిని ఈ మధ్య అంతా కృత్రిమంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ప్లాట్ కూడా అలానే ఉంటుంది. ఓ ఊరిలోని గ్రామస్తులంతా.. తమ ఇళ్లలో ఉన్న మూగజీవాలకు కృత్రిమంగా అంటే ఇంజెక్షన్స్ ద్వారా వాటికి గర్భం వచ్చేలా చేస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదని తెలిసినా కూడా గ్రామస్తులంతా అలానే చేస్తుండే వారు. ఇక సరిగ్గా అదే సమయంలో అదే ఊరిలో రాజు, రమ అనే ఇద్దరు యువతి యువకులకు పెళ్లి జరుగుతుంది. రాజు ఆవులకు కృత్రిమంగా గర్భం దాల్చే ఇంజెక్షన్స్ ను చేస్తూ ఉంటాడు. అయితే రాజుకు రమకు పెళ్లి అయ్యి ఐదేళ్లు గడిచిపోయినా కూడా పిల్లలు పుట్టరు. దీనితో ఊరంతా వారిద్దరి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు.

Veppam Kulir Manzil

ఆవులకు పిల్లలు పుట్టిస్తన్నారు కానీ తనకు పిల్లలు పుట్టడం లేదని.. అందరూ రాజును హేళన చేస్తూ ఉండేవారు. దీనితో ఓ రోజు వాళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్స్ చేయించుకుంటారు. ఆ టెస్ట్స్ లో రాజుకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలుతుంది. దీనితో వారి కుటుంబంలో చాలా సంఘటనలు చోటు చేసుకుంటాయి. రమ ఎలా అయినా పిల్లలను కనాలని ఫిక్స్ అవుతుంది. దానికి ఐవీఎఫ్ దారిని ఎంచుకుంటుంది. కానీ ఆ విషయం భర్తకు చెప్పదు. కొన్నాళ్ల తర్వాత రమ ఈ గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డకు ఐదేళ్లు వచ్చిన తరవాత ఈ రాజుకి అసలు విషయం చెప్పడంతో.. రాజు చాలా బాధపడతాడు. రమ మీద కోప్పడి ఆ పిల్లాడిని చంపే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? రాజుకు అలా అవ్వడానికి కారణం తానూ చేసే వృత్తేనా ! ఇక ఇంకేదైనా కారణం ఉందా ! ఇవన్నీ తెలియాలంటే “వెప్పం కులిర్ మజై” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం. వెంటనే చూసేయండి.. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి